కొంతమంది సక్సెస్ స్టోరీలు విన్న సమయంలో ఆశ్చర్యానికి లోనవుతూ ఉంటాం.అలాంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన సక్సెస్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఒకే బడిలో చదువుకున్న చిన్ననాటి స్నేహితులు ప్రస్తుతం రెండు చోట్ల డీజీపీలుగా ఉన్నారు.వాళ్లలో ఒకరు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు( AP DGP Dwaraka Tirumala Rao ) కాగా మరొకరు పాండిచ్చేరి డీజీపీ శ్రీనివాస్ కావడం గమనార్హం.
ఈ ఇద్దరు డీజీపీల సక్సెస్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న ఈ ఆఫీసర్లు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకున్నారు.1989 సంవత్సరంలో ద్వారకా తిరుమల రావు సివిల్స్ ( Civils )రాసి ఏపీ కేడర్ ను ఎంచుకోవడం జరిగింది.వేర్వేరు జిల్లాలకు ఎస్పీగా, బెజవాడకు కమిషనర్ గా ఆయనకు అనుభవం ఉండగా తాజాగా అయన డీజీపీగా పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది.

పాండిచ్చేరి డీజీపీ శ్రీనివాస్( DGP Srinivas ) 1990 సంవత్సరంలో జమ్మూ కశ్మీర్ క్యాడర్ కు ఐపీఎస్ గా ఎంపికయ్యారు.గతేడాది శ్రీనివాస్ పాండిచ్చేరి డీజేపీగా ఎంపికయ్యారు.వీళ్లిద్దరి సక్సెస్ స్టోరీ ప్రస్తుతం వైరల్ అవుతుండగా నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.వీళ్ల స్నేహితులు త్వరలో వీళ్లిద్దరికీ సన్మానం చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్( Patibandla Sitaramaiah High School ) లో వీళ్లిద్దరూ చదువుకోగా ఆ స్కూల్ లో పూర్వ విద్యార్ధులు ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది.ఈ డీజీపీల సక్సెస్ స్టోరీ నేటి తరం ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
ఒకే స్కూల్ నుంచి ఇద్దరు డీజీపీలు కావడం అరుదైన ఘనత అని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తుండటం గమనార్హం.ద్వారకా తిరుమలరావు, శ్రీనివాస్ సక్సెస్ స్టోరీలను ఎంత ప్రశంసించినా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.