రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల నోడల్ అధికారి ఎన్ రాజిరెడ్డి, మండల విద్యాధికారి భూక్య బన్నజీ ఆధ్వర్యంలో మండల వ్యాయామ విద్యాధికారి బుచ్చిరెడ్డి పర్యవేక్షణ లో క్రీడా పాఠశాలల్లో 4వ తరగతిలో ప్రవేశాల కొరకు పోతుగల్ స్కూల్లో సోమవారం విద్యార్థులకు ఎంపిక పోటీలు నిర్వహించారు.సామర్థ్య పరీక్షలువిద్యార్థులకు ఎత్తు, బరువు, 30 మీటర్ల ప్లయింగ్ స్టార్ట్, 60 మీటర్ల షటిల్ రన్, 800 మీటర్ల రన్నింగ్, స్టాండింగ్ బ్రాడ్ జంప్, ప్లెక్సిబిలిటీ టెస్ట్, మెడిసిన్ బాల్త్రో, వర్టికల్ జంప్ తదితర పరీక్షలు నిర్వహించారు ఇందులో మంచి నైపుణ్యం కనపరచిన విద్యార్థి విద్యార్థులను చివరి దశ ఎంపిక పోటీలకు ఎంపిక చేశారు అలాగే ఈ శారీరక సామర్థ్య పోటీలలో మంచి నైపుణ్యం కనపరచిన 10 మంది బాలురు 10 మంది బాలికలను
ఈ నెల 27,28,29 తేదీన రాజన్న సిరిసిల్ల లో జరిగే క్రీడాలలో ప్రతిభ చూపిన వారిని ఎంపిక చేస్తారని తెలిపారు.
ఈ సందర్బంగా ముఖ్య అతిదిగా విచ్చేసిన పోతుగల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాధా కిషన్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచి శారీరకంగా, మానసికంగా అభివృద్ధి సాధించేందుకు, క్రమశిక్షణను అలవర్చుకోవడానికి క్రీడా పాఠశాల లు ఉపయోగ పడతాయని అన్నారు.ఈ కార్యక్రమం లో మండల వ్యాయామ విద్యాధికారి బుచ్చిరెడ్డి, వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్, పర్శరాములు, రాజశేఖర్, శ్రీనివాస్, శ్యామ్ వివిధ పాఠశాల ల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.