పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Kalki ) నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి.( Kalki 2898 AD ) నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్గా విడుదల కానుంది.ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అలాగే తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.
దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.
![Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Kalki Bgm, Kalki Trailer, Prabhas, Prabhas K Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Kalki Bgm, Kalki Trailer, Prabhas, Prabhas K](https://telugustop.com/wp-content/uploads/2024/06/kalki-release-trailer-is-super-but-thats-the-only-minus-detailsa.jpg)
ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.ఈ ట్రైలర్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా కట్ చేసారు.గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్ ను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.
ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.స్టార్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ ,రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.
ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు.
![Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Kalki Bgm, Kalki Trailer, Prabhas, Prabhas K Telugu Nag Ashwin, Kalki, Kalki Ad, Kalki Bgm, Kalki Trailer, Prabhas, Prabhas K](https://telugustop.com/wp-content/uploads/2024/06/kalki-release-trailer-is-super-but-thats-the-only-minus-detailss.jpg)
అంతా బాగానే వుంది కానీ కల్కి రిలీజ్ ట్రైలర్ లో( Kalki Release Trailer ) ఒకటే మైనస్ ఈ ట్రైలర్ లో సంతోష్ నారాయణన్( Santosh Narayan ) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదని కామెంట్స్ వస్తున్నాయి.కానీ ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా మొత్తం మీద సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గూస్ బంప్స్ వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం ఈ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ప్రబాస్ కెరీర్ లో ఈ సినిమా రికార్డులు తిరగ రాయడం ఖాయం అనిపిస్తోంది.