చుండ్రు( Dandruff )ఒక్కసారి పట్టుకుందంటే ఓ పట్టాన అస్సలు వదిలిపెట్టదు.పైగా చుండ్రు వల్ల హెయిర్ ఫాల్ పెరిగిపోతుంది.
తలలో దురద, జుట్టు పొడిబారటం వంటి సమస్యలెన్నో తలెత్తుతూ ఉంటాయి.దాంతో చుండ్రును ఎలాగైనా పోగొట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఖరీదైన షాంపూలను వాడుతుంటారు.కొందరు వేలకు వేలు ఖర్చు పెట్టి చుండ్రును పోగొట్టే ట్రీట్మెంట్ కూడా చేయించుకుంటారు.
కానీ ఇంట్లోనే పైసా ఖర్చు లేకుండా ఒక్క దెబ్బతో చుండ్రును మాయం చేసుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే వండర్ ఫుల్ రెమెడీ సూపర్ ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.మరి ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.ముందుగా ఒక కలబంద( Aloe vera ) ఆకును తీసుకుని వాటర్ తో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలు, ఐదు నుంచి ఆరు శుభ్రంగా పొట్టు తొలగించిన వెల్లుల్లి రెబ్బలు, మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకుని స్మూత్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు టేబుల్ స్పూన్లు ఆముదం వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.కలబంద, వెల్లుల్లి, పెరుగు( curd ) మరియు ఆముదం లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు చుండ్రును చాలా వరకు పోగడ్తాయి.
స్కాల్ప్
ను శుభ్రంగా హెల్తీ గా మారుస్తాయి.మాక్సిమం ఒక్క వాష్ లోనే చుండ్రు మాయం అవుతుంది.ఇంకా లైట్ గా ఉంటే మరో రెండు మూడు సార్లు ఈ రెమెడీని పాటించండి.దీంతో చుండ్రుకు ఈజీగా బై బై చెప్పవచ్చు.