కల్కి రిలీజ్ ట్రైలర్ కు అది మాత్రమే మైనస్ అయిందా.. ఆ విషయంలో జాగ్రత్త పడాల్సిందేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్( Kalki ) నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడి.

( Kalki 2898 AD ) నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా ఈ నెల 27న గ్రాండ్గా విడుదల కానుంది.ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు మాత్రమే కాకుండా పాన్ ఇండియా ప్రేక్షకులు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.అలాగే తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వచ్చింది.

దర్శకుడు నాగ్ అశ్విన్( Nag Ashwin ) ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో ఎంతో రిచ్ గా తెరకెక్కించారు.

"""/" / ఫస్ట్ ట్రైలర్ తోనే మెప్పించిన నాగ్ అశ్విన్ తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ ట్రైలర్ విడుదల చేసారు.

ఈ ట్రైలర్ ను దర్శకుడు నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా కట్ చేసారు.

గ్రాండ్ విజువల్స్ తో పాటు ఎమోషన్ ను కూడా ఎంతో అద్భుతంగా చూపించారు.

ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది.స్టార్ డైరెక్టర్స్ సందీప్ రెడ్డి వంగ ,రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ సైతం ఈ సినిమా రిలీజ్ ట్రైలర్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు.

"""/" / అంతా బాగానే వుంది కానీ కల్కి రిలీజ్ ట్రైలర్ లో( Kalki Release Trailer ) ఒకటే మైనస్ ఈ ట్రైలర్ లో సంతోష్ నారాయణన్( Santosh Narayan ) అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదని కామెంట్స్ వస్తున్నాయి.

కానీ ఇది ట్రైలర్ మాత్రమే అని సినిమా మొత్తం మీద సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి గూస్ బంప్స్ వస్తాయని చిత్ర యూనిట్ తెలిపింది.

ప్రస్తుతం ఈ సినిమాకు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ ని బట్టి చూస్తే ప్రబాస్ కెరీర్ లో ఈ సినిమా రికార్డులు తిరగ రాయడం ఖాయం అనిపిస్తోంది.