చైనా, ఫ్రాన్స్ కలిసి నిర్వహించిన ఒక అంతరిక్ష మిషన్ శనివారం తెల్లవారుజామున ప్రమాదకరమైన మలుపు తిరిగింది.ఇటీవల గామా-కిరణ పేలుళ్లను అధ్యయనం చేయడానికి స్పేస్ వేరియబుల్ ఆబ్జెక్ట్స్ మానిటర్( SVOM ) ఉపగ్రహాన్ని ప్రయోగించారు.
ఈ మిషన్‌లో భాగంగా ఒక విషపూరిత రాకెట్ శిథిలం ప్రజల నివాస ప్రాంతంపై పడింది.చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (CNSA), ఫ్రాన్స్ CNES కలిసి జూన్ 22న చైనాలోని షిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుంచి ఉదయం 3 గంటలకు లాంగ్ మార్చ్ 2C రాకెట్ ప్రయోగించారు.
లాంగ్ మార్చ్ 2C రాకెట్( Long March 2C Rocket ) నుంచి ఒక భాగం భూమిపైకి పడి, ప్రజల నివాస ప్రాంతంలోకి ప్రవేశించింది.ఈ రాకెట్ శిథిలం విషపూరితమైన ఇంధనాన్ని కలిగి ఉండవచ్చని భయాలున్నాయి, దీని వల్ల ప్రజలకు ఆరోగ్య ప్రమాదం ఏర్పడవచ్చు.
ప్రయోగం విజయవంతం అయిన కొద్దిసేపటికే, రాకెట్ బూస్టర్( Rocket Booster ) ఒక నివాస ప్రాంతంలో పడిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ దృశ్యాలను చైనా నేషనల్ ఏషియా స్పేస్‌ఫ్లైట్ సంస్థ తమ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకుంది.
దీంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురై పారిపోయారు.
లాంగ్ మార్చ్ 2C రాకెట్‌లో ఉపయోగించే “హైపర్‌గోలిక్ ప్రొపలంట్” ( Hypergolic Propellant ) అనే ఇంధనం వల్లే ఈ ప్రమాదం జరిగింది.ఈ ఇంధనం ఎంతో విషపూరితమైనది.తాకిన వెంటనే మంటలు రావడానికి అవకాశం ఉంది.
అందువల్ల, ఇది నివాస ప్రాంతాలలో పడిపోతే చాలా ప్రమాదకరం.అంతరిక్ష మిషన్లకు ఇది చాలా నమ్మకదగిన ఇంధనం అయినప్పటికీ, భూమిపై దాని వల్ల కలిగే ప్రమాదాలు ఊహకందనివి.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా యూజర్లు భద్రతా ప్రమాదాల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.కొందరు వినియోగదారులు చైనా రాకెట్ ప్రయోగాల వల్ల కలిగే ప్రమాదాలను ఇతర దేశాలు పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నాలతో పోల్చి విమర్శించారు, మరికొందరు రాకెట్ల భాగాలను నిర్లక్ష్యంగా వదిలేయడాన్ని తప్పుబట్టారు.మరొక వినియోగదారుడు రాకెట్ తప్పుడు దిశలో వెళుతున్నట్లు ఫన్నీగా వ్యాఖ్యానించారు.