వేములవాడలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం

రాజన్న సిరిసిల్ల జిల్లా : కన్నతల్లి లాంటి బిఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉన్నత పదవులు అనుభవించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గుచేటు అని వేములవాడ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, పట్టణ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.సోమవారం పట్టణంలోని తెలంగాణ చౌకు వద్ద ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

 Effigy Of Mla Sanjay Burnt In Vemulawada, Effigy Burnt ,mla Sanjay Kumar, Vemul-TeluguStop.com

విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు దిష్టిబొమ్మ దగ్ధం అడ్డుకునే ప్రయత్నం చేశారు.శాంతియుతంగా నిరసన కార్యక్రమాలను చేపడితే పోలీసులను పెట్టి అడ్డుకోవడం నీచ రాజకీయానికి కాంగ్రెస్ పాల్పడుతుందని ఆరోపించారు.

రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని నిమ్మిశెట్టి విజయ్ విమర్శించారు.ఈ కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube