సూపర్ స్టార్ రజనీకాంత్( Superstar Rajinikanth ) తనదైన రీతిలో వరుస సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.ఇక ఈ ఏజ్ లో కూడా ఆయన యంగ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయం అనే చెప్పాలి.
ఒకప్పుడు భాషా, ముత్తు, నరసింహ లాంటి వరుస సక్సెస్ లను అందించిన రజనీకాంత్ ఇప్పుడు కూడా మళ్ళీ అదే రేంజ్ సక్సెస్ లను కొట్టాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమాతో తన స్టామినా ఏంటో చూపించిన రజనీకాంత్ ఇప్పుడు మరోసారి లోకేష్ కనకరాజ్( Lokesh Kanakaraj ) డైరెక్షన్ లో కూలీ అనే సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాలో తనను తాను మరొకసారి సూపర్ స్టార్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చూస్తున్నాడు.అయితే అందులో భాగంగానే ఈ సినిమాలో మలయాళం నటుడు ఫహాద్ ఫజిల్( Fahad Fazil ) నటిస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఆయనకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఆయనకు ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు అయితే ఉంది.ఇక ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నాడు.ఇక ఇంతకు ముందు లోకేష్ కనకరాజు చేసిన విక్రమ్ సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

ఇక రజనీకాంత్ హీరోగా చేస్తున్నాడు కాబట్టి ఫాహాద్ ఫజిల్ విలన్ గా చేస్తున్నాడా లేదంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.ఇక మొత్తానికైతే కూలీ సినిమా షూటింగ్ ను లోకేష్ కనకరాజు శరవేగంగా జరుపుతున్నాడు.ఇక తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక రజినీకాంత్ ఈ సినిమాలో వింటేజ్ లుక్స్ తో కనిపిస్తున్నాడు…ఇక మొత్తానికైతే ఈ సినిమాతో భారీ సక్సెస్ ను కొట్టబోతున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.








