ఓవర్ చేయకు నీ దిష్టే తగులుతుంది.. హరీష్ శంకర్ పోస్ట్ పై రవితేజ షాకింగ్ కామెంట్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటుడు రవితేజ( Raviteja ) ఒకరు.ఈయన హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

 Raviteja Shocking Reply To Harish Shankar Tweet Goes Viral Details,harish Shanka-TeluguStop.com

ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి రవితేజ డైరెక్టర్ హరీష్ శంకర్( Harish Shankar ) దర్శకత్వంలో మిస్టర్ బచ్చన్( Mister Bachchan ) అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Telugu Harish Shankar, Ravi Teja, Bachchan, Raviteja, Tollywood-Movie

ఇక ఈ సినిమా సెప్టెంబర్ నెలలోనే విడుదలకు సిద్ధమవుతుంది.ఈ క్రమంలోనే షూటింగ్ పనులను త్వరగా పూర్తిచేసే క్రమంలో చిత్ర యూనిట్ ఉన్నారు.ఇక తాజాగా చిత్ర బృందం కాశ్మీర్ లో( Kashmir ) షూటింగ్ పనులను జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇక్కడ ఓ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందని తెలుస్తుంది.ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.ఇందులో ఈయన ఒక బెంచ్ పై కాలు మీద కాలు వేసుకొని కూర్చుని ఉన్నారు.

Telugu Harish Shankar, Ravi Teja, Bachchan, Raviteja, Tollywood-Movie

ఇక ఈ ఫోటోని షేర్ చేసిన హరీష్ శంకర్ ఇలా రాసుకొచ్చారు.ప్రపంచకంలో అందరికి వయసొస్తుంది ఒక్క అన్నయ్యకి తప్ప అంటూ .కాశ్మీర్ లోయలో అద్భుతంగా షూటింగ్ చేసాం త్వరలో హైదరాబాద్ లో ల్యాండ్ అవుతాం అంటూ ట్వీట్ చేసారు.ఇక ఈ ట్వీట్ పై నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందించగా చివరికి రవితేజ కూడా హరీష్ శంకర్ చేసిన ట్వీట్ పై స్పందించారు.

ఓవర్ చేయకురోయ్.నీ దిష్టే తగిలేలా వుంది అంటూ ట్వీట్ చేసారు.

ప్రస్తుతం రవితేజ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ సినిమాలో ఈయన అమితాబ్ బచ్చన్ కి అభిమానిగా కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube