పునర్జన్మ అనేది నిజమేనా.. 4 ఏళ్ల బాలిక పాస్ట్ లైఫ్ గురించి చెప్పేస్తుందే..??

సాధారణంగా చనిపోయాక మళ్లీ కొందరు మనుషుల్లాగా పుడతారని ప్రజలు నమ్ముతుంటారు.దీన్నే పునర్జన్మ( Reincarnation ) అని పేర్కొంటారు అయితే ఇది అబద్ధం చాలా మంది అంటుంటారు కానీ గుజరాత్‌లోని( Gujarat ) పాలన్‌పూర్‌ జిల్లా ఖాసా గ్రామానికి చెందిన దక్ష( Daksha ) అనే నాలుగేళ్ల బాలిక కథ తెలుసుకుంటే నిజమేనేమో అనిపిస్తుంది.

 A 4-year-old Girl From Khasa Village In Palanpur Claims To Have Been Reincarnate-TeluguStop.com

ఆమె మాటలు వింటుంటే పునర్జన్మ సిద్ధాంతం అనేది ఉంది కాబోలు అనిపిస్తోంది.

దక్ష పేద కుటుంబంలో పుట్టింది.

ఇప్పటివరకు స్కూల్‌కు కూడా వెళ్లలేదు కానీ, ఆమె చాలా ఫ్లూయెంట్‌గా హిందీ( Hindi ) మాట్లాడుతుంది.ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఎందుకంటే ఆమె పుట్టిన ప్రాంతంలో సాధారణంగా హిందీ మాట్లాడరు.ఆమె తన ప్రస్తుత జీవితం గురించి, భవిష్యత్ ఆశయాల గురించి కూడా చాలా స్పష్టంగా మాట్లాడుతోంది.

ఆమె అంజార్‌ అనే ఊర్లో ఉండేదట.ఓ భూకంపంలో( Earthquake ) ఇంటి గోడ పడి మరణించానని చెబుతోంది.

ఈ మాటలు ఆమె కుటుంబాన్ని, ఊరి ప్రజలను విస్మయపరిచాయి.

Telugu Daksha, Daksha Reborn, Gujarat, Hindu, Khasa, Miracle, Palanpur, Palanpur

దేశభక్తితో సైన్యంలో చేరాలని, ఆంగ్ల మాధ్యమంలో చదువుకుని శత్రువులను ఓడించాలని దక్ష ఆశయాలు చెప్పడం, అలాగే హిందీలో మాట్లాడటం స్థానికులను ఆశ్చర్యపరిచాయి.పునర్జన్మ సాధ్యమే అని చాలామంది నమ్మటం కూడా ప్రారంభించారు.దక్ష చెప్పిన విషయాలు, ఆమె మాట్లాడే హిందీ బాషా పరిజ్ఞానం చూసి ఆమె కుటుంబం మొదట చాలా ఆశ్చర్యపోయారు.

కానీ, ఇప్పుడు వాళ్లు ఆమె కలలకు మద్దతు ఇస్తున్నారు, ఆమె ఆశయాలు నెరవేరుస్తాయని ఆశిస్తున్నారు.ఈ కథ ఖాసా గ్రామాన్ని( Khasa Village ) ఆకట్టుకుంది.

Telugu Daksha, Daksha Reborn, Gujarat, Hindu, Khasa, Miracle, Palanpur, Palanpur

పునర్జన్మ అంటే మరణించిన తర్వాత ఆత్మ( Soul ) మళ్ళీ కొత్త శరీరంలో పుట్టడం అని నమ్మకం.ఇది హిందూమతం, బౌద్ధమతం, జైనమతం, కొన్ని న్యూ ఏజ్ తత్వాలలో ఉంది.పునర్జన్మ నిజమో కాదో ఇప్పటికీ కచ్చితంగా చెప్పలేం, ఇది ఒక నమ్మకమే తప్ప శాస్త్రీయంగా నిరూపించలేదు.

శాస్త్రీయంగా చూస్తే, పునర్జన్మకు ఎలాంటి నిరూపణలు లేవు.

ఎక్కువగా పిల్లలు చెప్పే గత జన్మ జ్ఞాపకాల లాంటివి ఆధారాలుగా ఉంటాయి.వారు మునుపటి జన్మకు సంబంధించిన ప్రదేశాలు, వ్యక్తులు, సంఘటనల గురించి వివరంగా చెబుతారు.

కానీ, వాటిని నిజమని నిరూపించలేం.అవి నమ్మకాల పైనే ఆధారపడి ఉంటాయి, వాటిని అలా అర్థం చేసుకోవచ్చు, నమ్మకం లేని వారు అనుమానించవచ్చు కూడా.

ఈ మాదిరి గత జన్మ జ్ఞాపకాలను మనస్తత్వవేత్తలు, పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు కానీ, వాటిపై ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉన్నాయి.పునర్జన్మకు శాస్త్రీయ నిరూపణ అందించలేకపోతున్నాము.అవి ఎక్కువగా వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube