ఏదైనా సినిమా ప్రేక్షకుడిని కన్విన్స్ చేయాలంటే స్ట్రాంగ్ లైన్ ఉండాలి.అంటే మంచి కథ అయి ఉండాలి.
అప్పుడే ప్రేక్షకుడు నచ్చుతాడు అలాగే సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుంది.కానీ కొన్నిసార్లు కథ ఎలా ఉన్నా కూడా స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేయొచ్చు.
జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రేక్షకుడు ఎక్కువగా వినోదాన్ని కోరుకుంటున్నాడు.ప్రతిసారి ట్విస్ట్ ఉండాలని చూస్తున్నాడు.
అప్పుడే సినిమా విజయం సాధిస్తుంది అని దర్శకులు కూడా నమ్ముతున్నారు.ఇక మరికొన్ని సార్లు సినిమా బాగుంది అంటారు కానీ కలెక్షన్స్ రావు.
టాక్ ఎలా ఉన్నావ్ ప్లాప్ అనే ముద్ర పడుతుంది.అలా సినిమా ఎంతో అద్భుతంగా ఉంది అనుకున్నప్పటికి నిర్మాతకు నష్టాలను మిగిల్చిన త్రివిక్రమ్( Trivikram ) దర్శకత్వంలో వచ్చిన సినిమా అతడు.( Athadu Movie )
ఈ సినిమా కథ మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) త్రివిక్రమ్ వినిపించగా 15 నిమిషాలు కాగానే పవన్ కళ్యాణ్ నిద్రలోకి జారుకున్నారట.దాంతో ఆయన అక్కడి నుంచి వచ్చేసారట.ఇక మహేష్ బాబుకి( Mahesh Babu ) త్రివిక్రమ్ కథ చెప్పినప్పుడు కథ మొత్తం విని ఆయన ఏమి చెప్పకుండా లేచి వెళ్లిపోయారట.దాంతో తన కథలో ఏదైనా లోపం ఉందా అని అనుమానం వచ్చిందట త్రివిక్రమ్ కి.అయితే కాసేపటి తర్వాత లోపలికి వచ్చి సినిమా కథ చాలా బాగుంది మన పద్మాలయ బ్యానర్ లోనే తీస్తున్నాం నాన్నగారికి కూడా నచ్చింది అంటూ మహేష్ బాబు చెప్పారట.అప్పటికే నువ్వే నువ్వే అనే సినిమాను స్రవంతి రవి కిషోర్ బ్యానర్ లో తెరకేక్కిస్తున్నారు త్రివిక్రమ్.
తన రెండవ సినిమాను జయభేరి మురళీమోహన్ బ్యానర్ పై తెరకెక్కిస్తానని ఆయనకు మాట ఇస్తానని చెప్పాడట త్రివిక్రమ్.ఆయనకు మాట ఇచ్చానని అమౌంట్ అడ్వాన్స్ కూడా తీసుకున్నా అని చెప్పారట.అయితే మీకు కబురు చేస్తాను వెళ్ళండి అంటూ మహేష్ బాబు చెప్పారట.ఓ రెండేళ్ల వరకు మహేష్ బాబు నుంచి ఎలాంటి సమాధానం రాలేదట.త్రివిక్రమ్ కి ఆ లోపు ఒక్కడు, అర్జున్, నాని అంటూ మూడు నాలుగు సినిమాలు చేశారట.చివరికి అర్జున్ సినిమా( Arjun Movie ) టైంలో పైరసీ వివాదాల్లో కోర్టు కూడా వెళ్లాల్సి వచ్చింది.
ఈ విషయాన్ని సర్దుమనిగాక త్రివిక్రమ్ కి పిలుపు వచ్చిందట.జయభేరి బ్యానర్ లోనే సినిమా చేయగా 25 కోట్లతో తీశారు.
అయితే కేవలం 17 కోట్లు మాత్రమే రైట్స్ ద్వారా వచ్చాయి.ఇక ఆ తర్వాత తెరకెక్కిన మహేష్ పోకిరి సినిమా సూపర్ హిట్ కావడంతో మాటీవీ వారు అతడు సినిమాను ఐదు కోట్లకు టీవీ రైట్స్ కి కొనుక్కున్నారు.
సినిమా కు మాట్లాడుకున్న టైం అయిపోవడంతో మరో ఏడు కోట్లు పెట్టి మా టీవీ వారే టెలికాస్ట్ రైట్స్ తీసుకున్నారు అలా మొత్తానికి మురళీమోహన్( Murali Mohan ) గట్టెక్కాడు.
ఈ సినిమా మాటీవీలో సృష్టించిన ప్రభంజనం అంతా కాదు.ఏకంగా 1000 సార్లకు పైగా అతడు సినిమా టెలికాస్ట్ అయింది.ఇప్పుడు చూసినా కూడా బోర్ కొట్టకుండా సినిమా అద్భుతంగా ఉంటుంది.
ఈ సినిమాలో మహేష్ బాబు కేవలం డైలాగ్స్ తో కాకుండా ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ కనిపిస్తారు.ఈ సినిమాకు సంబంధించిన మొత్తం డబ్బింగ్ మహేష్ బాబు కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేశారు అంటే ఆయనకు ఎంత తక్కువ డైలాగ్స్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇలా ఎంతో మంచి టాక్ ఉన్నట్టుగా అనిపించినప్పటికీ నష్టాలు వచ్చి చివరికి గట్టెక్కారు నిర్మాత.అయితే త్రివిక్రమ్ వర్క్ కి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్ అయిపోయారు.
అప్పటి వరకు ఏ డైరెక్టర్ కూడా త్రివిక్రమ్ స్టైల్ లో సినిమా తీయలేదు అని చెప్పేవారట మహేష్ బాబు.