రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిజెపి పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు మెరుగు అంజా గౌడ్ ఆధ్వర్యంలో శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అఖండ భారతదేశ స్ఫూర్తిని గుండెగుండెలోనూ రగిలించిన జాతీయవాది, నిరాండబరతకు నిదర్శనంగా నిలిచిన జననేత, దేశభక్తికి నిలువుటద్దంగా నిలిచిన స్ఫూర్తిప్రదాత డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు.
భారత దేశంలో సంపూర్ణంగా విలీనమైన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఉద్యమం ప్రారంభించారని కాశ్మీర్ కోసం ప్రాణాలనే త్యజించిన మహానీయుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, ఓబీసీ మోర్చా అధ్యక్షులు చిగురు వెంకన్న ప్యాక్స్ డైరెక్టర్ ఏళ్ల గిరిధర్ రెడ్డి, చిట్టినేని శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు ఎదునూరి గోపి, గూడ బాల్ రెడ్డి ,కోల్ల కృష్ణ, కస్తూరి కార్తీక్ రెడ్డి, చీకోటి మహేష్, మద్దికుంట రమేష్ , పున్నం అనిల్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.