తాజాగా భారత దేశ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో( ISRO ) ‘ పుష్పక్ ‘ ప్రయోగాన్ని మూడోసారి విజయవంతంగా పూర్తి చేసింది.పూర్తిగా స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించి స్వదేశీ స్పేస్ షటిల్ గా పిలిచే ఈ వాహనాన్ని మరోసారి మరికొన్ని కఠిన పరిస్థితులలో నిర్వహించి విజయవంతంగా ప్రయోగాన్ని ముగించారు.
కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ లో ఉన్న ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించిన ఈ ప్రయోగం స్పేస్ నుంచి తిరుగు వచ్చే వాహక నౌక పనితీరు., అలాగే దాని లాండింగ్ పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా చూపించిందని ఇస్రో పేర్కొంది.
ఈ నేపథ్యంలో నింగిలోకి ఉపయోగించే ఉపగ్రహ విడి భాగాలు, అలాగే వాటిని మోసుకు వెళ్లే స్పేస్ సిప్పుల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ పుష్పక్( Pushpak ) ప్రాజెక్టుని విజయవంతంగా చేసింది.ఈ ప్రయోగంలో రియుజబుల్ లాంచ్ వెహికల్( Reusable Launch Vehicle ) అభివృద్ధికి కావాల్సిన సాంఘిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో మరోసారి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.ఈ విషయంలో ఇదివరకే రెండుసార్లు ప్రయోగించిన పుష్పక్ ప్రయోగం విజయవంతం అవ్వగా మరోసారి ఈ ప్రయోగాన్ని కొత్త సవాళ్లతో కూడిన పరిస్థితులలో చేసినట్లు తెలిపింది.
స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యం కోసం పుష్పక్ మళ్లీ ప్రదర్శించీనట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ ప్రయోగంలో ఇండియన్ నేవీకి చెందిన చినూక్ హెలికాప్టర్( Chinook Helicopter ) ద్వారా పుష్పక్ ను ఆకాశంలోకి తీసుకువెళ్లి రన్ రేకు నాలుగు కిలోమీటర్ల దూరంలో, అలాగే నాలుగున్నర కిలోమీటర్ ఎత్తు నుండి జార విరిచారు.దాంతో పుష్ప స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని ఉపయోగిస్తూ.
క్రాస్ రేంజ్ కదిలికలను నియంత్రిస్తూ పుష్పక్ రన్వే దిశగా తన పయనాన్ని చేసుకొని., సెంట్రల్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ను చేసింది.
దీంతో ఇస్రో ప్రయోగాన్ని మరింత విజయవంతం సాధించింది.