వైరల్ వీడియో: సిక్సర్ దెబ్బకి స్టేడియం పైన ఉన్న సోలార్ ప్యానల్ బద్దలైందిగా..

ప్రస్తుతం జరుగుతున్న టి 20 ప్రపంచకప్ లో( T20 World Cup ) భాగంగా సూపర్ 8లో జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్, అమెరికా మధ్య మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

 Jos Buttler Six Breaks Glass Of Solar Panel T20 World Cup 2024 Details, Viral Vi-TeluguStop.com

ఈ మ్యాచ్ గెలవడంతో గ్రూప్ 2 దాటి సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకుంది.ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్( Jos Buttler ) బ్యాటింగ్ లో పెను విధ్వంసంను సృష్టించాడు.

కేవలం 38 బంతుల్లోనే 6 ఫోర్లు, 7 సిక్సర్లతో ఏకంగా 83 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.ఇకపోతే ఈ మ్యాచ్ లో బట్లర్ కొట్టిన ఓ భారీ సిక్సర్( Sixer ) ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ సిక్సర్ దెబ్బకు స్టేడియం రూఫ్ పైన ఉన్న సోలార్ ప్యానల్( Solar Panel ) దెబ్బకు బద్దలైంది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ఈ మ్యాచ్ లో అమెరికా బౌలర్ హర్మీత్ సింగ్( Harmeet Singh ) వేసిన 9వ ఓవర్లో ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తన విశ్వరూపాన్ని చూపించాడు.ఈ ఓవర్లో మొదటి బాల్ మినహాయించి వరుసగా 5 సిక్సులు బాది.32 రన్స్ సాధించారు.ఈ 5 సిక్సుల్లోనే ఓ భారీ సిక్సర్ దెబ్బకి స్టేడియం పై ఉన్న సోలార్ ప్యానల్ దెబ్బతింది.

ఈ భారీ సిక్సర్ 104 మీటర్ల వెళ్లి అక్కడ సోలార్ ప్యానల్ బ్రేక్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఇక మ్యాచ్ స్కోర్ చూస్తే.మొదట బ్యాటింగ్ చేసిన అమెరికా 18.5 ఓవర్లులలోనే 115 పరుగులకే కుప్పకూలింది.ఇక ఇంగ్లాండ్ బౌలర్ హ్యాట్రిక్ హీరో క్రిస్ జోర్డాన్ 4 వికెట్లతో అమెరికా బ్యాటింగ్ పతనాన్ని శ్యాసించాడు.ఇక అమెరికా బ్యాటెర్ నితీశ్ కుమార్ 30 పరుగులతో టాప్ స్కోరర్ గా ననిలువగా.ఆపై 116 పరుగుల టార్గెట్ ను కేవలం 9.4 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా ఇంగ్లాండ్ బ్యాటర్స్ ఊచకోత కొసారు.ఛేదనలో భాగంగా కెప్టెన్ బట్లర్ 83 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.మరో ఎండ్ లో ఫిలిప్ సాల్ట్ 25 పరుగులు చేసి తోడుగా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube