అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ అగ్రతారాలలో ఒకరైన అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) తాజాగా ఓ అభిమానికి క్షమాపణలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.

 Nagarjuna Apologizes For Guards Inhumane Gesture At Airport Video Viral Details,-TeluguStop.com

ప్రస్తుతం తమిళ హీరో ధనుష్( Dhanush ) సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హీరో ధనుష్ తో పాటు నాగార్జున కూడా ఎయిర్పోర్ట్ లో కలిసి నడుస్తున్నారు.

అయితే అక్కడే పనిచేస్తున్న ఓ పెద్ద వయసు గల వ్యక్తి హీరో నాగార్జునను చూస్తేనే అతడితో మాట్లాడాలని భావించి ఆయనకు దగ్గరగా వెళ్ళాడు.అయితే హీరోలకు సెక్యూరిటీ గార్డ్స్( Security Guards ) వెంటనే స్పందించి అతడిని అక్కడ నుంచి బయటకు నెట్టివేశారు.

దీంతో అతడు కింద పడిపోయేలా కనిపించినా చివరికి తట్టుకొని నిలబడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో కాస్త నాగార్జున దృష్టికి వెళ్ళింది.దీంతో నాగార్జున ఆ వీడియోని షేర్ చేస్తూ తన క్షమాపణలు తెలియజేశాడు.నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఇప్పుడే ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది.ఇలా జరిగి ఉండకూడదు.ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకుంటాను.

అతడికి క్షమాపణలు అంటూ పోస్ట్ చేశాడు.దీంతో నెటిజన్స్ నాగార్జున పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇక ఈ పోస్టుకు సంబంధించి నెటిజెన్స్ కామెంట్ చేస్తూ.తప్పు చేసింది సెక్యూరిటీ గార్డ్స్ వారి కోసం మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అంటుండగా మరికొందరైతే.మీరు సినిమాల్లోనే కాదు రియల్ జీవితంలో కూడా హీరోనే అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో( Kubera Movie ) నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube