అభిమానికి క్షమాపణ చెప్పిన నాగార్జున.. అసలు ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ అగ్రతారాలలో ఒకరైన అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) తాజాగా ఓ అభిమానికి క్షమాపణలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.ప్రస్తుతం తమిళ హీరో ధనుష్( Dhanush ) సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హీరో ధనుష్ తో పాటు నాగార్జున కూడా ఎయిర్పోర్ట్ లో కలిసి నడుస్తున్నారు.

అయితే అక్కడే పనిచేస్తున్న ఓ పెద్ద వయసు గల వ్యక్తి హీరో నాగార్జునను చూస్తేనే అతడితో మాట్లాడాలని భావించి ఆయనకు దగ్గరగా వెళ్ళాడు.

అయితే హీరోలకు సెక్యూరిటీ గార్డ్స్( Security Guards ) వెంటనే స్పందించి అతడిని అక్కడ నుంచి బయటకు నెట్టివేశారు.

"""/" / దీంతో అతడు కింద పడిపోయేలా కనిపించినా చివరికి తట్టుకొని నిలబడ్డాడు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో కాస్త నాగార్జున దృష్టికి వెళ్ళింది.

దీంతో నాగార్జున ఆ వీడియోని షేర్ చేస్తూ తన క్షమాపణలు తెలియజేశాడు.నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఇప్పుడే ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది.

ఇలా జరిగి ఉండకూడదు.ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకుంటాను.

అతడికి క్షమాపణలు అంటూ పోస్ట్ చేశాడు.దీంతో నెటిజన్స్ నాగార్జున పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

"""/" / ఇక ఈ పోస్టుకు సంబంధించి నెటిజెన్స్ కామెంట్ చేస్తూ.తప్పు చేసింది సెక్యూరిటీ గార్డ్స్ వారి కోసం మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అంటుండగా మరికొందరైతే.

మీరు సినిమాల్లోనే కాదు రియల్ జీవితంలో కూడా హీరోనే అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.

ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో( Kubera Movie ) నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.

రాజాసాబ్ సినిమాలో నాని ఉన్నాడా..? ఈ క్యారెక్టర్ లో కనిపిస్తాడు..?