ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇక ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున ప్రజలకు హామీలు ఇచ్చింది టీడీపీ కూటమి.
ఆ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా టిడిపి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది.ఇప్పటికే మెగా డీఎస్సీ, పెన్షన్ పెంపు వంటి హామీల అమలుపై సీఎం చంద్రబాబు( CM Chandrababu ) సంతకాలు చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.తాజాగా ఏపీ ప్రజలకు మరో శుభవార్తను చెప్పింది కొత్త ప్రభుత్వం.
చంద్రన్న బీమాకు( Chandranna Bheema ) సంబంధించి కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్( Minister Vasamsetti Subhash ) తాజాగా ప్రకటన చేశారు.

ఇంట్లో కుటుంబ పెద్ద చనిపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు తీసుకువచ్చిన బీమా పథకం సొమ్మును మూడు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతున్నట్లు మంత్రి తాజాగా ప్రకటించారు.కార్మికులతో పాటు, మీడియా ప్రతినిధులు , లాయర్లను కూడా ఈ బీమా పథకం కిందకు తెచ్చే ఆలోచనలో ఉన్నామని , గత వైసిపి పాలనలో చంద్రన్న బీమా పథకం పేరు మార్చారని , దీని కారణంగా ఎంతో మందికి పరిహారం అందలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం భీమా సొమ్మును మూడు నుంచి పది లక్షలకు పెంచింది అని మంత్రి సుభాష్ ప్రకటించారు.

చంద్రన్న భీమా అందరికీ అందేలా చూస్తామని , ఏపీ వ్యాప్తంగా కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కార్మికులు కార్మిక శాఖలో రూ 15 కట్టి ఈ పథకంలో చేరవచ్చు అని మంత్రి తెలిపారు .ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల పరిహారం అందుతుంది.ఈరోజు జరుగుతున్న ఏపీ క్యాబినెట్( AP Cabinet Meeting ) సమావేశం ముగిసిన అనంతరం కార్మిక బీమా తో పాటు మరికొన్ని అంశాలపై నిర్ణయాలు వెలువడనున్నాయి.







