ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు కల్కికి ప్లస్ అవుతాయా.. టాక్ ముఖ్యం అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభాస్( Prabhas ) నాగ్ అశ్విన్( Nag Ashwin ) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కల్కి మూవీ( Kalki Movie ) భారీ టికెట్ రేట్లతో విడుదల కానుందని తెలుస్తోంది.ఆచార్య, ఆదిపురుష్, గుంటూరు కారం సినిమాలకు పెరిగిన టికెట్ రేట్లే మైనస్ అయ్యాయని చాలామంది భావించారు.

 Will Ticket Rates Plus For Kalki Movie Details, Prabhas, Kalki Movie, Kalki Movi-TeluguStop.com

ఆర్.ఆర్.ఆర్, సలార్, మరికొన్ని సినిమాలు మాత్రమే పెరిగిన టికెట్ రేట్ల వల్ల బెనిఫిట్ పొందాయని చెప్పవచ్చు.

ఆ సినిమాలకు శాపమైన టికెట్ రేట్లు( Ticket Rates ) కల్కికి ప్లస్ అవుతాయా అనే చర్చ జరుగుతోంది.

కల్కి సినిమా టాక్ బాగుంటే టికెట్ రేట్లు ఎంత ఉన్నా ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపించే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.కల్కి సినిమా ఓటీటీలో సైతం ఆలస్యంగా స్ట్రీమింగ్ కానుందని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతుండటం గమనార్హం.

కల్కి 2898 ఏడీ( Kalki 2898 AD ) మూవీ రిలీజ్ కు మరో 72 గంటల సమయం మాత్రమే ఉంది.కల్కి సినిమా ఏకంగా 3 గంటల నిడివితో రిలీజ్ కానుండటం గమనార్హం.కల్కి సినిమాలో కల్కి పాత్రలో ఎవరు కనిపిస్తారనే చర్చ జరుగుతుండగా ఆ ప్రశ్నలకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.కల్కి సినిమాలో ప్రభాస్( Prabhas ) భైరవ పాత్రలో కనిపించనుండటంతో ఈ ప్రశ్నలు వినిపిస్తుండటం గమనార్హం.

సినిమాలో అమితాబ్, ప్రభాస్ పాత్రల మధ్య ఫైట్ సీన్స్ వావ్ అనేలా ఉండనున్నాయని సమాచారం అందుతోంది.కల్కి 2898 ఏడీ సినిమా అంచనాలను మించి ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సినిమా ఫ్యాన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.సినిమాలో కమల్ హాసన్( Kamal Haasan ) లుక్ అద్భుతంగా ఉండగా కమల్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెడుతుందని ఈ సినిమాతో కమల్ మరో సక్సెస్ ను అందుకోవడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube