యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు( Jr NTR ) ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది.తారక్ నిన్ను చూడాలని సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టగా చిన్న వయస్సులోనే తారక్ కు మాస్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు ఉంది.
కెరీర్ తొలినాళ్లలో బొద్దుగా కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత రోజుల్లో లుక్ ను మార్చుకుని ఫ్యాన్స్ మెప్పు పొందారు.ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్ తో మెప్పించిన ఎన్నో సాంగ్స్ తారక్ ఖాతాలో ఉన్నాయి.జూనియర్ ఎన్టీఆర్ బిరుదు మ్యాన్ ఆఫ్ మాసెస్( Man Of Masses ) కాగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ప్రస్తుతం విదేశాల్లో షూట్ జరుపుకుంటున్న సాంగ్ కు బాస్కో మార్టిస్ కొరియోగ్రాఫర్ గా( Choreographer Bosco Martis ) వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం.జూనియర్ ఎన్టీఆర్ కు డ్యాన్స్ కంపోజ్ చేసే విషయమై బాస్కో మార్టిస్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

పఠాన్, వార్, ఫైటర్ లాంటి ఎన్నో హిట్ సినిమాల కోసం బాస్కో మార్టిస్ పని చేశారు.బాస్కో మార్టిస్ తారక్ తో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.ఈ ఫోటోలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లుక్ కొత్తగా ఉంది.ఎన్టీఆర్ అసాధారణ ప్రతిభ కలిగిన హీరో అని తారక్ తో పని చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.

దేవర సినిమాకు( Devara Movie ) బాస్కో మార్టిస్ పని చేస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు మరింత పెరుగుతున్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.దేవర సినిమాలో అదిరిపోయే సాంగ్స్ కూడా ఉండనున్నాయని జరుగుతున్న ప్రచారం ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది.జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారనే సంగతి తెలిసిందే.తారక్ తన పర్ఫామెన్స్ తో ఫ్యాన్స్ ను మెప్పిస్తున్నారు.