సాధారణంగా ఒక్కోసారి మన స్కిన్ టోన్ రోజు రోజుకు తగ్గుతున్నట్లు అనిపిస్తుంటుంది.స్కిన్ టోన్( Skin tone ) అనేది పెరిగితే బాధపడరు.
కానీ తగ్గితే మాత్రం తీవ్ర ఒత్తిడికి లోవుతుంటారు.చర్మ ఛాయను పెంచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వండి.ఇప్పుడు చెప్పబోయే కొన్ని టిప్స్ ను ఫాలో అయితే తగ్గిన చర్మ ఛాయను సులభంగా పెంచుకోవచ్చు.
మొదట డైట్ లో పలు మార్పులు చేసుకోవాలి.
ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్( Fast foods, bakery foods, oily foods ), కూల్ డ్రింక్స్ ను తీసుకోవడం మానుకోవాలి.క్యారెట్, బీట్ రూట్, పుచ్చకాయ, బొప్పాయి, లెమన్, స్ట్రాబెర్రీస్, బాదం, వాల్ నట్స్, టమాటోలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఇవి కలర్ ను ఇంప్రూవ్ చేయడంలో చాలా బాగా సహాయపడతాయి.అలాగే శరీరానికి సరిపడా నీటిని అందించాలి.బయటకు వెళ్ళినప్పుడు తప్పకుండా సన్ స్క్రీన్ ను వాడాలి.
ఇక చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మెరిపించడానికి ఉత్తమమైన హోమ్ రెమెడీ ఒకటి ఉంది.దాని కోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు టమాటో స్లైసెస్, మూడు లెమన్ స్లైసెస్, వన్ టేబుల్ స్పూన్ బియ్యం( rice ), రెండు టేబుల్ స్పూన్ల పెరుగు( curd ) వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్టైనర్ సహాయంతో జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ జ్యూస్ లో వన్ టేబుల్ స్పూన్ ముల్తానీ మట్టి, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ముఖానికి మరియు మెడకు ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి.20 నిమిషాల తర్వాత వాటర్ తో కడిగేయాలి.రెండు రోజులకు ఒకసారి ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే మీ స్కిన్ వైట్ గా బ్రైట్ గా మారుతుంది.మచ్చలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.చర్మం అందంగా మెరుస్తుంది.