పవన్ కళ్యాణ్ డిసెంబర్ లో వస్తే ఈ యంగ్ హీరోలా పరిస్థితి ఏంటి..?

ఇక స్టార్ హీరోలందరూ సినిమాలు రిలీజ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు.అలాగే టైర్ 2 హీరోలు కూడా తమ సినిమాలని రిలీజ్ చేసుకోవడానికి ఏ డేట్ లు ఖాళీగా ఉన్నాయో వెతుక్కుంటున్నట్టుగా తెలుస్తుంది.

 What Will Be The Situation Of This Young Heros If Pawan Kalyan Og Comes In Decem-TeluguStop.com

అయితే ఇప్పటికే క్రిస్మస్ కానుకగా చాలా సినిమాలని అనౌన్స్ చేశారు.ఇక అందులో నితిన్ ( Nithin ) హీరోగా వస్తున్న రాబిన్ హుడ్( Robinhood ) ఒకటి కాగా, నాగచైతన్య( Naga Chaitanya ) హీరోగా వస్తున్న తండేల్ సినిమా( Thandel ) మరొకటి కావడం విశేషం…

ఇక వీళ్లిద్దరూ కూడా భారీ సక్సెస్ ని అందుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ రెండు సినిమాల మీద కూడా మంచి అంచనాలు ఉండడంతో ప్రేక్షకులు వీటిలో ఏ సినిమాని సూపర్ సక్సెస్ చేస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే ఈ రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడుతుందా లేదంటే ఏ సినిమా వాళ్ళైనా వెనక్కి తగ్గే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

 What Will Be The Situation Of This Young Heros If Pawan Kalyan Og Comes In Decem-TeluguStop.com

ఇక మొత్తానికైతే డిసెంబర్ నెలలో( December ) వీళ్ళిద్దరూ తమ సత్తా ఏంటో చూపించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఓజీ సినిమా( OG Movie ) రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయింది.

కాబట్టి ఆ సినిమా కూడా డిసెంబర్ లో వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.ఒకవేళ ఓజీ సినిమా కనుక డిసెంబర్ లో వచ్చినట్టైతే నితిన్, నాగచైతన్య ఇద్దరు కూడా తమ తమ సినిమాలను పోస్ట్ పోన్ చేసుకోక తప్పదు.ఎందుకంటే పవన్ కళ్యాణ్ కి( Pawan Kalyan ) పోటీ గా వాళ్ల సినిమాలను రిలీజ్ చేస్తే ఏం జరుగుతుందనే విషయం మనందరికీ తెలిసిందే…అందువల్లే పవన్ కళ్యాణ్ కనక డిసెంబర్ లో వస్తే మాత్రం వాళ్ళు తప్పకుండా వాళ్ళ సినిమాలని ఫిబ్రవరి వరకు పోస్ట్ పోన్ చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube