దగ్గర పడుతున్న రుణమాఫీ గడువు... అర్హతలు ఇవేనా ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ సూపర్ సిక్స్( Congress Super Six ) పేరుతో 6 పథకాలను ప్రధానంగా ప్రకటించింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.

 Who Are Eligible For Crop Loan Waiver Scheme By Telangana Government Details, Te-TeluguStop.com

ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రైతు రుణమాఫీ.( Farmers Loan Waiver ) తెలంగాణ లో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా ప్రకటించారు.

ఇప్పుడు చూస్తే రుణ మాఫీ అమలు సమయం దగ్గర పడుతోంది.మరో రెండు నెలల్లో రైతు రుణమాఫీని అమలు చేయాల్సి ఉంటుంది.

అయితే దీనిని ఏ విధంగా అమలు చేస్తారు అనేది సవాల్ గా మారింది .ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రైతు రుణమాఫీ విషయంలో విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

Telugu Congress, Croploan, Farmersloan, Hareesh Rao, Raithu Runamafi, Revanth Re

కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయలేదని, రుణమాఫీని సక్రమంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి , బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు( Harish Rao ) ప్రకటించారు.  తన రాజీనామా లేఖను అమరవీరుల స్థూపం వద్ద మీడియా మిత్రులకు కూడా అందించారు.  అయితే రాజీనామాకు హరీష్ రావు రెడీగా ఉండాలని,  రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు.దీంతో రైతు రుణమాఫీ విషయాన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గానే తీసుకున్నారు.

Telugu Congress, Croploan, Farmersloan, Hareesh Rao, Raithu Runamafi, Revanth Re

ఈ పథకం అమలు గడువు సమీపిస్తుండడం తో దీనిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.రుణమాఫీకి అర్హులు ఎవరు ? దీనిని ఏ విధంగా అమలు చేయాలనే విషయం పైన దృష్టి సారించారు.  రుణమాఫీ పొందాలంటే కచ్చితంగా పట్టాదారు పాస్ బుక్ , రేషన్ కార్డు ఉండాలని నిబంధనను విధించారు.  దీంతో పాటు ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు,  పార్లమెంట్ సభ్యులు , ఆదాయపు పన్ను చెల్లించేవారికి రుణమాఫీ నుంచి మినహాయింపు  ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నారు.  అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందుతున్న వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube