దగ్గర పడుతున్న రుణమాఫీ గడువు… అర్హతలు ఇవేనా ? 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ సూపర్ సిక్స్( Congress Super Six ) పేరుతో 6 పథకాలను ప్రధానంగా ప్రకటించింది.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించింది.

ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రైతు రుణమాఫీ.( Farmers Loan Waiver ) తెలంగాణ లో ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కూడా ప్రకటించారు.

ఇప్పుడు చూస్తే రుణ మాఫీ అమలు సమయం దగ్గర పడుతోంది.మరో రెండు నెలల్లో రైతు రుణమాఫీని అమలు చేయాల్సి ఉంటుంది.

అయితే దీనిని ఏ విధంగా అమలు చేస్తారు అనేది సవాల్ గా మారింది .

ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రైతు రుణమాఫీ విషయంలో విమర్శలు,  ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

"""/" / కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయలేదని, రుణమాఫీని సక్రమంగా అమలు చేస్తే రాజీనామా చేస్తానని మాజీ మంత్రి , బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు( Harish Rao ) ప్రకటించారు.

  తన రాజీనామా లేఖను అమరవీరుల స్థూపం వద్ద మీడియా మిత్రులకు కూడా అందించారు.

  అయితే రాజీనామాకు హరీష్ రావు రెడీగా ఉండాలని,  రేవంత్ రెడ్డి కూడా సవాల్ చేశారు.

దీంతో రైతు రుణమాఫీ విషయాన్ని రేవంత్ రెడ్డి సీరియస్ గానే తీసుకున్నారు. """/" / ఈ పథకం అమలు గడువు సమీపిస్తుండడం తో దీనిపై అధికారులు కసరత్తు మొదలుపెట్టారు.

రుణమాఫీకి అర్హులు ఎవరు ? దీనిని ఏ విధంగా అమలు చేయాలనే విషయం పైన దృష్టి సారించారు.

  రుణమాఫీ పొందాలంటే కచ్చితంగా పట్టాదారు పాస్ బుక్ , రేషన్ కార్డు ఉండాలని నిబంధనను విధించారు.

  దీంతో పాటు ఎమ్మెల్యేలు,  ఎమ్మెల్సీలు,  పార్లమెంట్ సభ్యులు , ఆదాయపు పన్ను చెల్లించేవారికి రుణమాఫీ నుంచి మినహాయింపు  ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది.

ఈ మేరకు అధికారులు విధి విధానాలను రూపొందించే పనిలో ఉన్నారు.  అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధులు పొందుతున్న వారి జాబితాను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.

2024 సంవత్సరంలో డిజాస్టర్లుగా నిలిచిన సినిమాలివే.. భారీగా నష్టాలు వచ్చాయిగా!