రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు( CM Chandrababu ) బదిలీ బాధ్యతలు చేపట్టాక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు.ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు( Ration Card Holders ) ఏపీ ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.

 Ap Govt Gave Good News To Ration Card Holders Details, Chandrababu, Ap Governam-TeluguStop.com

విషయంలోకి వెళ్తే వచ్చే నెల ఒకటవ తేదీ నుంచి బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు అందించనున్నట్లు స్పష్టం చేయడం జరిగింది.సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

గత కొన్ని నెలలుగా రేషన్ షాపులలో కందిపప్పు ఇవ్వటం లేదని సమాచారం తెలుసుకోవడంతో.వెంటనే చంద్రబాబు కందిపప్పు కూడా ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

దీంతో పంపిణీ కోసం కందిపప్పును( Pulses ) కొనుగోలు చేసి ఎమ్ఎల్ఏస్ పాయింట్లకు తరలించారు.సాధారణంగా జూన్ 20వ తేదీ వరకు రేషన్ షాపులకు( Ration Shop ) సరుకులు చేరుకుంటాయి.ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో కందిపప్పు చెక్కెర కూడా మిగతా సరుకులతో పాటు రేషన్ దుకాణాలకు చేరనుంది.బహిరంగ మార్కెట్లలో కందిపప్పు రేటు రోజురోజుకి పెరుగుతున్న క్రమంలో.

ఏపీ ప్రభుత్వం( AP Govt ) తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్ పెంచటం జరిగింది.

జులై 1 నుంచి పెరిగిన పింఛన్లు అమల్లోకి రానుండగా వాటికి జతగా తెల్ల రేషన్ కార్డుదారులకు అనుకూలంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవటం సంచలనంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube