వరలక్ష్మి పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కూతురి ఫోటో చూశారా.. ఇంత పెద్ద కూతురా అంటూ?

కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్( Varalaxmi Sarathkumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.వరలక్ష్మి ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Varalakshmi Sarath Kumar Would Be Husband Nicholai Sachdev 1st Wife And Daughter-TeluguStop.com

సినిమా హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇకపోతే వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లి పీటలు ఎక్కనుంది.ఇక పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న కొద్ది పెళ్లి పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉంది.

Telugu Kollywood, Mk Stalin-Movie

ఈ మేరకు ఆమె తన పెళ్ళికి వరలక్ష్మి శరత్ కుమార్, తండ్రి శరత్ కుమార్, రాధికతో కలిసి తమిళ సీఎం స్టాలిన్ ( CM Stalin )దగ్గర నుంచి కోలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఆహ్వానాలు పలుకుతోంది.సూపర్ స్టార్ రజినీకాంత్, సూర్య, నయనతార లాంటి స్టార్స్ ని పెళ్ళికి ఆహ్వానిస్తోంది.ఒక్క కోలీవుడ్ నటులకు మాత్రమే కాకుండా టాలీవుడ్ కి చెందిన సెలబ్రిటీలకు కూడా పెళ్లి కార్డులు పంపిస్తోంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో రవితేజ, సమంత, హరిష్ శంకర్, గోపీచంద్ మలినేని లాంటి సెలబ్రిటీస్ ని తన పెళ్ళికి ప్రత్యేకంగా ఆహ్వానిస్తుంది.

శరత్ కుమార్ రీసెంట్ గా విశ్వంభర సెట్స్ కి వెళ్లి మరీ మెగాస్టార్ కి పెళ్లి పత్రిక అందించి వచ్చారు.

Telugu Kollywood, Mk Stalin-Movie

ఇది ఇలా ఉంటే వరలక్ష్మి శరత్ కుమార్ చేసుకోబోయేవాడికి ఇది రెండో పెళ్లి అన్న విషయం మనలో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.అతను నికోలయ్‌ సచ్ దేవ్( Nicholai Sachdev ) ఆర్ట్ గ్యాలరీ ఓనర్ అన్న విషయం కూడా తెలిసిందే.అతనికి రెండో పెళ్లి అనే విషయం తనకి తెలుసు అని, తాను అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నట్టుగా వరలక్ష్మి తెలిపిన విషయం తెలిసిందే.

అయితే వరలక్ష్మి చేసుకోబోయేవాడు నికోలయ్‌ సచ్ దేవ్ కి ఆల్రెడీ ఒక కుమార్తె ఉంది.ఆమె వయసులో చాలా పెద్ద అమ్మాయి కూడా.తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ నికోలయ్‌ సచ్ దేవ్ మొదటి భార్య కుమర్తెతో సెల్ఫీ దిగి సొషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగానే అమ్మో వరలక్ష్మి నికోలయ్‌ సచ్ దేవ్ కి అంత పెద్ద కూతురా ఎలా ఒప్పుకున్నావ్ ఈ పెళ్లికి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube