గుమ్మడికాయ మాట వినగానే అందరి మదిలో ఒక ఆలోచన వస్తుంది.అది ఏంటంటే.
నూతన గృహ ప్రవేశం రోజున ఇంట్లోకి వెళ్ళేటప్పుడు గుమ్మడికాయను ఇంటి ముందు దిష్టి తీసి కొడుతూ ఉంటారు కదా.అయితే చాలామంది గుమ్మడికాయను ఇంటి దిష్టి పోవడానికి ఉపయోగిస్తారు అనుకుంటారు.కానీ గుమ్మడికాయను కూర వండుకుని తింటారు అనే విషయం చాలా మందికి తెలియదు.అలాగే ఈ గుమ్మడికాయను చాలా మంది తినడానికి అయిష్టత చూపిస్తారు.కొందరు మాత్రమే తింటారు.అయితే మీకు తెలియని విషయం ఏంటంటే ఈ గుమ్మడికాయను తినడం వలన ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని.
ఈ గుమ్మడికాయలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతు నొప్పి తగ్గించే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి.
అలాగే గుమ్మడి కాయను తినడం వలన విటమిన్ సి, ఇ, ఏ, ఐరన్ పుష్కలంగా లభిస్థాయి.
శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి గుమ్మడికాయ ఎంతగానో సహయపడుతుంది.గుమ్మడి కాయ తినడం వలన రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.
ఎందుకంటే ఇందులో ఐరన్ ఉంటుంది కనుక.గుమ్మడి కాయ గుజ్జు, విత్తనాలలో విటమిన్ సి, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి.
అలాగే గుమ్మడికాయలో పీచు పదార్ధాలు అధికంగా ఉంటాయి.అలాగే కేలరీలు కూడా తక్కువగా ఉండడం వలన శరీరంలో కొవ్వు అనేది పేరుకోదు.
బరువు తగ్గాలని భావించేవారు రోజువారి ఆహారంలో గుమ్మడికాయ తీసుకుంటే బరువు తగ్గుతారు.ఎందుకంటే గుమ్మడికాయతో పైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.గుమ్మడికాయలో విటమిన్ ఎ ఎక్కువగా ఉండడం వలన కళ్లకు మంచి జరుగుతుంది. అలాగే ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడడంలో కూడా గుమ్మడికాయ పాత్ర చాలానే ఉంది.
మొటిమల సమస్యతో ఇబ్బంది పడేవాళ్ళు గుమ్మడి కాయ గుజ్జుతో మాస్క్ తయారు చేసుకోని ముఖానికి వేసుకోవడం వలన మొటిమలు తగ్గుముఖం పడతాయి.