కార్తీకదీపం నటికి చేదు అనుభవం.. డీఎస్పీ అంటూ కాల్ చేసి అలా చేశారా?

దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఆన్లైన్ లో మోసాలు పెరిగిపోతున్నాయి.స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరుగుతున్న కొద్దీ అమాయకులను ఆసరాగా చేసుకుని కొందరు దారుణంగా మోసం చేస్తున్నారు.

 Karthigai Deepam Actress Usha Rani Latest Video Goes Viral, Karthika Deepam, Ush-TeluguStop.com

ముఖ్యంగా ఆన్లైన్ లావాదేవీలకు సంబంధించి కొందరు కేటుగాళ్లు లేనిపోని మెసేజ్లు పంపించి ట్రాక్ చేసి కోట్లకు కోట్లు కొల్లగొడుతున్నారు.కేవలం సామాన్యులు మాత్రమే కాకుండా సెలబ్రిటీలు కూడా ఈ కేటుగాల బారిన పడి మోసపోతున్నారు.

ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ సైబర్ నేరగాళ్లు ( Cyber ​​criminals )కొత్త కొత్త విధంగా మోసాలకు పాల్పడుతున్నారు.

తాజాగా ఒక సీరియల్ నటికీ ఇలాంటి అనుభవమే ఎదురైంది.ఆ సీరియల్ నటి మరెవరో కాదు కార్తీకదీపం సీరియల్ ( Karthikadeep serial )నటి ఉషారాణి( Usharani ).ఈమె తాజాగా సైబర్ నేరగాళ్ళ నుంచి కొంచెం లో తప్పించుకుంది.ఒక కేటుగాడు డీఎస్పీని( DSP ) అంటూ ఫోన్‌ చేసి ఓటీపీ వివరాలు అడిగితే తెలివిగా వ్యవహరించి ఆన్‌లైన్‌ మోసానికి చెక్‌ పెట్టింది.ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.నాకు ఒక ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ ఉంది.అందులో మొత్తం రూ.5 లక్షల వరకు షాపింగ్‌ చేసుకోవచ్చు.

దానిని మా అబ్బాయి బయటకు తీసుకెళ్లి ఎక్కడో పోగొట్టుకున్నాడు.వాడు తరచు ప్యాంట్‌ జేబులో పెట్టి మర్చిపోతుంటాడు.ఈ సారి కూడా ఎక్కడో పెట్టే ఉంటాడులే అనుకొని బ్లాక్‌ చేయకుండా వదిలేశాను.ఆ కార్డు అమోజాన్‌కి లింక్‌ అయి ఉండడంతో నా షాపింగ్‌కి కూడా ఇబ్బంది కాలేదు.

పని జరుగుతుంది కదా అని నేను లైట్‌ తీసుకున్నాను.కొన్నిరోజుల తర్వాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది.

అవతలి నుంచి ఒక వ్యక్తి చాలా గంభీరమైన గొంతుతో నేను డీఎస్పీని మాట్లాడుతున్నాను.మీరు ఉషారాణి కదా.మీ నంబర్ ఒక ఫ్రాడ్ కేసుకు లింక్ అయి ఉంది.ఆ కేసును క్యాన్సిల్ చేసేందుకు ఒక ఓటీపీ వస్తుంది.

దానిని షేర్ చేయండి అని అడిగాడు.అయితే నేను కాసేపు ఆలోచించాను.

ఆ వెంటనే తేరుకుని అసలు ఓటీపీలు చెప్పకండి అని మీరే అంటారు కదా మళ్లీ ఓటీపీ ఎందుకు అడుగుతున్నారు? అని అడిగాను.నేను ఆఫీస్ కే వచ్చి ఓటీపీ చెప్తాను అనడంతో అతను ఫోన్ కట్ చేశాడు.

కాసేపటికి వాట్సాప్ కి ఒక బిల్లు కూడా పెట్టారు.అందులో మా ఇంటి అడ్రెస్, ఫోన్ నంబర్, అన్నీ వివరాలు ఉన్నాయి.

దీంతో నేను వెంటనే అలెర్ట్ అయ్యాను.దీనిని ఇలాగే వదిలేస్తే పెద్ద ప్రమాదం జరుగుతుందని గ్రహించాను.

వెంటనే బ్యాంకుకు వెళ్లి ఆ క్రెడిట్ కార్డును బ్లాక్ చేయించాను.జాగ్రత్తగా ఉండండి మోసపోకండి అని ఉషారాణి చెప్పుకొచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube