ఈ పొడి సర్వరోగ నివారిణి.. రోజుకు అర స్పూన్ తీసుకున్న బోలెడు ఆరోగ్య లాభాలు!

ఇటీవల కాలంలో మధుమేహం, ఊబకాయం, రక్తపోటు, క్యాన్సర్ ( Diabetes, obesity, hypertension, cancer )ఇలా ఎన్నో జబ్బులు మానవుల్ని పట్టి పీడిస్తున్నాయి.ఈ జబ్బులు శారీరకంగానే కాకుండా మానసికంగా మరియు ఆర్థికంగా కూడా దెబ్బతీస్తున్నాయి.

 If You Take This Powder Regularly, You Will Get Many Health Benefits! Health, He-TeluguStop.com

వీటికి దూరంగా ఉండాలి అంటే కచ్చితంగా ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి.మంచి ఆహారాన్ని తీసుకోవాలి.

నిత్యం వ్యాయామం చేయాలి.అలాగే ఇప్పుడు చెప్పబోయే పొడి సర్వరోగ నివారిణిగా పనిచేస్తుంది.

ఈ పొడిని నిత్యం అర స్పూన్ చొప్పున తీసుకున్న చాలు బోలెడు ఆరోగ్య లాభాలు పొందుతారు.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో ఒక చిన్న కప్పు మెంతులు( fenugreek ) వేసి దోరగా వేయించుకుని తీసుకోవాలి.

ఆ తర్వాత అదే పాన్ లో ఆర కప్పు వాము మరియు పావు కప్పు న‌ల్ల జీలకర్ర( Black cumin ) విడివిడిగా వేసి వేయించుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు.

వాము( Ajwain ) మరియు న‌ల్ల‌ జీలకర్ర వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పొడిని ఒక టైట్ జార్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.

Telugu Ajwain Seeds, Fenugreekblack, Fenugreek Seeds, Tips, Latest, Benefits-Tel

రోజు నైట్ డిన్నర్ పూర్తి చేశాక ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర స్పూన్ తయారు చేసుకున్న పొడిని కలిపి తీసుకోవాలి.ఆపై ఎటువంటి ఆహారం తీసుకోకూడదు.మెంతులు, వాము, న‌ల్ల‌ జీలకర్ర ఈ మూడింటి కలయిక మన శరీరంలో ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది.నిత్యం మెంతులు వాము జీలకర్ర పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పెరిగిపోయిన విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి.

మధుమేహం ఉన్నవారికి ఈ పొడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

Telugu Ajwain Seeds, Fenugreekblack, Fenugreek Seeds, Tips, Latest, Benefits-Tel

అలాగే ఈ పొడిని రోజు తీసుకోవడం వల్ల బ్యాడ్‌ కొలెస్ట్రాల్ కరుగుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.అంతేకాదు ఊబకాయం నుంచి బయటపడడానికి, క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి, హార్మోన్లలో హెచ్చుతగ్గులను సరి చేయడానికి, రోగ నిరోధక వ్యవస్థను బలపరచడానికి కూడా ఈ పొడి అద్భుతంగా సహాయపడుతుంది.

కాబట్టి సర్వరోగ నివారిణి ఆయన ఈ పొడిని తప్పకుండా రెగ్యులర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube