మానవులు ఆహారపు గొలుసులో అగ్రస్థానంలో ఉన్నారని చెప్పవచ్చు.అందువల్ల, ఇతర జాతులను రక్షించుకోవలసిన బాధ్యత మనది.
అయితే, జంతువులను హింసించడం, వేధించడం తరచుగా జరుగుతుంది.ఈ హానికరమైన పనులకు భారీ మూల్యం కూడా చెల్లించాల్సి ఉంటుంది.
జంతువులకు చెడు చేయడం వల్ల ఫుడ్ చైయిన్( Food chain ) దెబ్బుతింటుంది.ఎవరైనా ఇలాంటి పనులు చేస్తూ ప్రభుత్వం దృష్టికి వస్తే కఠిన చర్యలు ఫేస్ చేయాల్సిందే.
తాజాగా న్యూజిలాండ్ ( New Zealand )దేశం, ఆక్లాండ్‌కు చెందిన ఒక వ్యక్తి కూడా ఇటువంటి తప్పు చేస్తూ దొరికిపోయాడు.రెండు కిల్లర్ తిమింగలాలు లేదా ఓర్కాస్‌లపై అతడు దూకుదాం అనుకున్నాడు.
దీనినే “బాడీ స్లామ్”( Body Slam ) అంటారు.అతడు తిమింగలాలను ఇలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిచాడని తెలిసాక ప్రభుత్వం 600 డాలర్ల (సుమారు రూ.30,000) జరిమానా విధించింది.ఫిబ్రవరిలో ఆక్లాండ్ శివారు ప్రాంతమైన డెవన్‌పోర్ట్ తీరంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
న్యూజిలాండ్‌కు చెందిన “డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్”( Department of Conservation ) అనే ప్రభుత్వ సంస్థ మే 20న ఒక వీడియోను ఫేస్‌బుక్‌లో పంచుకుంది.ఆ వీడియోలో ఒక వ్యక్తి ఒక క్రూయిజ్ షిప్ నుండి నీటిలోకి దూకుతూ కనిపిస్తాడు.అతను ఒక ఓర్కా (కిల్లర్ వేల్) పైకి దూకడానికి ప్రయత్నించాడు, ఆ ఓర్కా తన పిల్లతో కలిసి ఈదుతోంది.ఆ వ్యక్తి ఓర్కాను “బాడీ స్లామ్” చేయడంలో విఫలమయ్యాడు, కానీ ఆ జల జీవిని తాకడానికి ప్రయత్నించాడు, ఇది కూడా చట్టవిరుద్ధం.
ఆ వ్యక్తి “నేను దానిని తాకాను” అని అరుస్తూ వినిపిస్తున్నాడు, అతనితో పాటు ఉన్న ఇతరులు క్రూయిజ్ షిప్‌లో నవ్వుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నారు.సదరు వ్యక్తి తన పనితీరును వీడియో తీశారా అని ఇతరులను అడిగాడు, ఆ తర్వాత మళ్లీ ఓర్కాను తాకడానికి ప్రయత్నించాడు.
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ ఓర్కాను తాకబోయిన వ్యక్తిని “మూర్ఖుడు” అని పిలిచింది.ఆ వ్యక్తి చట్టవిరుద్ధంగా ప్రవర్తించాడని, అతని గుర్తింపును వెల్లడించలేదని తెలిపింది.ఈ సంఘటన రక్షించబడిన సముద్ర క్షీరదాల పట్ల “ఆశ్చర్యకరమైన, మూర్ఖపు” వైఖరిని చూపించిందని అధికారులు అన్నారు.ఆ వ్యక్తి తన సురక్షితతను, ఓర్కా పిల్లతో కలిసి ఈదుతున్న పెద్ద మగ ఓర్కా సురక్షితతను పట్టించుకోలేదని వారు విమర్శించారు.
ఈ వీడియో గురించి ఒక పౌరుడు వారికి సమాచారం ఇచ్చాడని, న్యూజిలాండ్ వన్యప్రాణి చట్టాలను ఉల్లంఘించే చర్యలను తమ దృష్టికి తీసుకొచ్చినందుకు ఆ వ్యక్తికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్జర్వేషన్ పేర్కొంది.అయితే సోషల్ మీడియా సార్లు ఈ పని చేసిన వ్యక్తి పేరు వెల్లడించాలని పబ్లిక్ లో పరువు తీయాలని డిమాండ్ చేశారు.https://www.facebook.com/share/v/15xkB6fRERmqbvnX/?mibextid=9rXMBq ఈ లింకుపై క్లిక్ చేసి వీడియో చూడవచ్చు.