లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ( Prajwal Revanna ) ఈనెల 31వ తేదీన భారత్ కు రానున్నారు.అదే రోజున ఆయన సిట్( SIT ) ఎదుట విచారణకు హాజరుకానున్నారు.
తాను ఏ తప్పూ చేయలేదని ప్రజ్వల్ రేవణ్ణ పేర్కొన్నారు.తనపై రాజకీయ పరమైన కుట్ర జరిగిందన్న ఆయన ఆధారాలు లేని అభియోగాలు మోపారని తెలిపారు.
ఈ క్రమంలో సిట్ విచారణకు పూర్తిగా సహకరిస్తానని వెల్లడించారు.న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని పేర్కొన్నారు.అయితే మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 27న జర్మనీకి( Germany ) వెళ్లిన సంగతి తెలిసిందే.