పసుపు ఆరోగ్యానికే కాదు జుట్టును కూడా ఒత్తుగా మారుస్తుంది.. ఇంతకీ ఎలా వాడాలంటే?

పసుపు( Turmaric ).దాదాపు ప్రతి ఒక్కరి వంటింట్లో నిత్యం వాడే మసాలా ఇది.

 Try This Turmeric Mask For Thick Hair! Thick Hair, Hair Care, Hair Care Tips, La-TeluguStop.com

ఏ కూర వండిన చిటికెడు పసుపు అందులో పడాల్సిందే.పసుపు ఆహారానికి మంచి రుచి, రంగు అందిస్తుంది.

అలాగే ఆరోగ్యానికి పసుపు ఎంతో మేలు చేస్తుంది.పసుపులో పొటాషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ సి, విటమిన్ ఇ, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా నిండి ఉంటాయి.

అందువల్ల ప‌సుపు అనేక జబ్బులకు అడ్డు కట్ట వేస్తుంది.అయితే ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టును ఒత్తుగా మార్చే సామర్థ్యం కూడా పసుపుకు ఉంది.

మరి ఇంతకీ జుట్టుకు పసుపును ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం పదండి.

Telugu Care, Care Tips, Latest, Turmericthick, Turmeric-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్లు పసుపును వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్ పెరుగు( curd ), వన్ టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్( Olive oil ), వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్( Lemon juice ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

అరగంట అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Latest, Turmericthick, Turmeric-Telugu Health

పసుపులో ఉండే పోషకాలు తలలో రక్త ప్రసరణను( Blood circulation ) పెంచుతాయి.స్కాల్ప్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.మరియు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.

ఈ పసుపు హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జట్టు ఒత్తుగా ఆరోగ్యంగా మారుతుంది.అలాగే పసుపులో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చుండ్రుతో పోరాడతాయి.

స్కాల్ప్ ఇరిటేషన్ మరియు చుండ్రు సమస్యల‌ను వదిలించడానికి ఈ పసుపు హెయిర్ మాస్క్‌ చాలా బాగా సహాయపడుతుంది.అంతేకాకుండా పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కాలుష్యం, యూవీ కిరణాలు మరియు జుట్టుకు హాని కలిగించే ఇతర పర్యావరణ కారకాల వల్ల ఏర్పడే ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించడంలో తోడ్ప‌డ‌తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube