బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్( Hrithik Roshan ) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2( War 2 ).ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.YRF స్పై సినిమాటిక్ యూనివర్స్( YRF Spy Cinematic Universe ) లో భాగంగా రూపొందుతున్న ఈ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ మూవీని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ( Director Ayan Mukherjee ) తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాలో కియారా అద్వానీ, శార్వరి హీరోయిన్స్ గా నటించనున్నారు.ఈ సినిమాలో ఎన్టీఆర్ రా ఏజెంట్ గా ఒక కీలక పాత్రలో నటించనున్నారట.
అలాగే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కూడా వుండనుందని తెలుస్తోంది.అదే ఎన్టీఆర్ తమ్ముడి పాత్ర ఈ పాత్ర కోసం మేకర్స్ మరో స్టార్ హీరోను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఆ స్టార్ హీరో మారెవరో కాదు కన్నడ స్టార్ హీరో ధృవ్ సర్జా( Dhruv Sarja ).ఈయన ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించనున్నట్లు సమాచారం.అయితే ఈ పాత్రకు సినిమాలో తక్కువ నిడివి వుండనున్నట్లు తెలుస్తోంది.
వార్ మొదటితో పార్ట్ కంటే ఈ సెకండ్ పార్ట్ లో యాక్షన్ సీక్వెన్సెస్ మరింత ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్, హృతిక్ మధ్య వచ్చే యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉండనున్నట్లు సమాచారం.ఈ భారీ యాక్షన్ సన్నివేశాల కోసం మార్వెల్ మూవీ స్టంట్ మాస్టర్ స్పిరో రజాటోస్ ని రంగంలోకి దింపినట్లు తెలుస్తుంది.మరి ఈ మూవీ ఎలా వుండబోతుందో అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.