గూగుల్ గొంతు మన కర్నూలు అమ్మాయిదే.. గ్రీష్మారెడ్డి గురించి ఈ షాకింగ్ విషయాలు తెలుసా?

మనలో గూగుల్( Google ) గురించి తెలియని వాళ్లు ఎవరూ ఉండరనే సంగతి తెలిసిందే.మనకు ఏదైనా పదానికి తెలుగులో అర్థం కావాలంటే గూగుల్ ద్వారా సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తామనే సంగతి తెలిసిందే.

 Google Voice Over Artist Greeshma Reddy Inspirational Success Story Details, Goo-TeluguStop.com

అయితే చెవులకు ఎంతో శ్రావ్యంగా వినిపించే గొంతు మన తెలుగమ్మాయి, కర్నూలు అమ్మాయి గ్రీష్మారెడ్డిదే( Greeshma Reddy ) కావడం గమనార్హం.గ్రీష్మారెడ్డి బీటెక్ చదివి ఢిల్లీలో సివిల్స్ కోసం ప్రిపేర్ అయ్యారు.

గ్రీష్మారెడ్డి స్వస్థలం కర్నూలు( Kurnool ) కాగా తల్లి శశీదేవి డిప్యూటీ కలెక్టర్ గా పని చేశారు.డిప్యూటీ కలెక్టర్ గా ఆమె రిటైర్ కాగా నాన్న జేసీ నాథ్ కలెక్టర్ గా రిటైర్ కావడం గమనార్హం.

చెన్నైలోని ఒక కాలేజ్ లో గ్రీష్మారెడ్డి బయో టెక్నాలజీలో బీటెక్ చేశారు.ఢిల్లీకి వెళ్లిన తర్వాత గ్రీష్మ కొన్ని కారణాల వల్ల ఎంబీఏ జాయిన్ అయ్యారు.ఆ తర్వాత గ్రీష్మ ఎం.ఏ సైకాలజీ చేయడం గమనార్హం.

ఒక స్నేహితురాలి ద్వారా గ్రీష్మకు వాయిస్ ఓవర్( Voice Over ) రంగం గురించి తెలిసిందని ఆ రంగంపై దృష్టి పెట్టారని భోగట్టా.బాల్యం నుంచి మ్యూజిక్ అంటే ఇష్టమని మాట్లాడటం అంటే ఇంకా ఇష్టమని డబ్బింగ్ ఎలా చెబుతారో అనే ఆసక్తి ఉండేదని గ్రీష్మారెడ్డి పేర్కొన్నారు.అందుకే వాయిస్ ఓవర్ దిశగా అడుగులు వేశానని ఆమె పేర్కొన్నారు.

ఒకరోజు గూగుల్ నుంచి కబురొచ్చిందని గూగుల్ ట్రాన్స్ లేటర్ తో( Google Translator ) గొంతు కలిపే ఛాన్స్ దక్కిందని గ్రీష్మారెడ్డి అన్నారు.ఎన్నో వేల తెలుగు పదాలు పలకడంతో పాటు వందల కథనాలు చదివేది.పదానికి అనుగుణంగా ఉచ్ఛారణ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం ఆమెకు ప్లస్ అయింది.

తెలుగుతో పాటు ఇతర భాషల్లో ప్రభుత్వ ప్రకటనల కోసం ఆమె పని చేస్తున్నారు.గ్రీష్మారెడ్డి టాలెంట్ తో అంతకంతకూ ఎదుగుతుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube