అక్కినేని ఫ్యామిలీలో ద లెజెండరీ హీరోగా గుర్తింపు పొందిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao ) గారు.ఒకప్పుడు తన నటనతో ప్రతి ప్రేక్షకుడిని సినిమా థియేటర్ కి రప్పించిన నటుడు కూడా ఆయనే కావడం విశేషం.
ఇక తన డ్యాన్స్ తో చాలా మంది ఫ్యాన్స్ ను కూడా సంపాదించుకున్నారు.ఇక ఎంటైర్ కెరియర్ లో ఆయన చేయని సినిమా లేదు, ఆయన వేయని పాత్ర లేదు.
ఇండస్ట్రీకి ఉన్న రెండు కళ్ళలో తను ఒకరిగా పేరు సంపాదించుకున్నారు.
ఆయన నటన ముందు ఎన్ని అవార్డులు ( Awards )వచ్చినా కూడా అవి చాలా చిన్నవే అవుతాయి.
ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీ నుంచి ఆయన తర్వాత జనరేషన్ లో కింగ్ నాగార్జున( Nagarjuna ) వచ్చారు.శివ సినిమా( Siva movie ) తో ఇండస్ట్రీ హిట్ కొట్టి ఇండస్ట్రీలో ఉన్న నలుగురు టాప్ హీరోల్లో తను కూడా ఒకరిగా ఎదిగాడు.
ప్రస్తుతం ఇప్పటికి కూడా ఆయన వరుస సినిమాలను చేస్తూ అక్కినేని ఫ్యామిలీ స్టార్ డమ్( Family Star Dum ) ను నిలబెడుతూ వస్తున్నాడు.అయితే గత కొద్ది రోజుల నుంచి ఈయన వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు.
ఇక ఇప్పుడు తన 100 వ సినిమా తో ఒక భారీ కంబ్యాక్ ను ఇవ్వాలని చూస్తున్నాడు.ఇక ఈయన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన వాళ్లలో అక్కినేని సుమంత్( Akkineni Sumanth ) ఒకరు.
ఈయన ప్రేమ కథ సినిమాతో తెలుగు తెర కి పరిచయం అయ్యాడు.అది ఒక డీసెంట్ మూవీ గా మంచి గుర్తింపును సంపాదించుకుంది.

ఇక అక్కడి నుంచి మొదలైన ఆయన ప్రస్థానం సక్సెస్ ఫుల్ గా సాగుతూనే వస్తుంది.హిట్లు, ఫ్లాపులు అనే తేడా లేకుండా వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు.వైవిధ్యమైన పాత్రలను చేయడంలో తన ఎప్పుడు ముందుంటాడని ఇప్పటివరకు చాలా సార్లు ప్రూవ్ చేశాడు.ఇక ఇప్పుడు అదే బాటలో మరోసారి ‘వారాహి ‘( Varahi ) అనే సినిమాతో భారీ కంబ్యాక్ ని ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది… ఇందులో ఒక డిఫరెంట్ పాత్రను కూడా పోషిస్తున్నాడు అనేది మనకు ఆ సినిమా గ్లింప్స్ ను చూస్తేనే అర్థమవుతుంది.
ఇక నిజానికి ఆరడుగుల ఎత్తు, మిల్క్ వైట్ స్కిన్ టోన్ తో హీరో అనే పదానికి కరెక్ట్ గా సరిపోయే బాడీ లాంగ్వేజ్ తో ప్రేక్షకులు హీరో అంటే ఇలానే ఉండాలి అనుకునే కటౌట్ తో మెస్మరైజ్ చేసే హీరో సుమంత్.

వాళ్ళ తాతగారు అయిన నాగేశ్వరరావు గారు అలాగే వాళ్ళ మామయ్య అయిన నాగార్జున గారి నట వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీ కి వచ్చిన సుమంత్ సత్యం, గౌరీ, గోదావరి , సుబ్రమణ్యపురం, మళ్ళీ రావా లాంటి సినిమాలతో భారీ సక్సెస్ లను అందుకొని తనకు తానే పోటీ అంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇక ఇప్పుడు మరోసారి వారాహి సినిమాతో భారీ కంబ్యాక్ ఇచ్చి తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు… ఇక వైవిధ్యమైన కథలు, పాత్రలు ఎక్కడుంటే సుమంత్ అక్కడ ఉంటాడు అనేది మాత్రం వాస్తవం…ఇక ఈ సంవత్సరం మాత్రం భారీ కంబ్యాక్ ఇవ్వబోతున్నాడు అనేది వారాహి గ్లింప్స్ చూస్తేనే మనకు అర్థం అయిపోతుంది… అల్ ది బెస్ట్ అక్కినేని సుమంత్…
.