బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణను ధర్మాసనం రేపటికి వాయిదా వేసింది.
కాగా విచారణలో భాగంగా ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి ( Advocate Vikram Chaudhary )వాదనలు వినిపించారు.ఈ క్రమంలోనే పిటిషన్ పై ఈడీ మరియు సీబీఐ తరపు వాదనలను న్యాయస్థానం రేపు విననుంది.
ఈడీ, సీబీఐ వాదనల అనంతరం కవిత తరపు న్యాయవాది కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.ఈ నేపథ్యంలో వాదనలు పూర్తయిన తరువాత రేపు తీర్పును రిజర్వ్ చేస్తామని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.