ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ పిళ్లై( Arun Pillai ) పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.ఈ మేరకు అరుణ్ పిళ్లై పిటిషన్ పై జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ( Justice Abhay Oka, Justice Satish Chandra Sharma ) ధర్మాసనం విచారణ జరిపింది.
అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న అరుణ్ పిళ్లై తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పై ఢిల్లీ హైకోర్టుకే వెళ్లాలని సూచించింది.