అర్జున్ రెడ్డి ఫేమ్, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) ఇప్పటిదాకా 10 సినిమాలను రిజెక్ట్ చేశాడు.అందులో నాలుగు బ్లాక్ బస్టర్ సినిమాలు కూడా ఉండటం విశేషం.
ముందుగా ఆర్ఎక్స్ 100( RX 100 ) గురించి చెప్పుకోవాలి.ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు అయితే కార్తికేయ కంటే ముందే ఇందులో హీరోగా చేయాలని దర్శకుడు అజయ్ భూపతి విజయ్ దేవరకొండను కోరాడు.
అయితే ఆర్ఎక్స్ 100 హీరో రోల్ కాస్త అర్జున్ రెడ్డికి దగ్గర్లోనే ఉంటుంది.కాబట్టి తాను ఈ సినిమా చేస్తే అది ఇద్దరికీ మైనస్ అవుతుందనే విజయ్ దానిని రిజెక్ట్ చేశాడు.
కట్ చేస్తే ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది ఇందులోని పాటలు చాట్ బస్టర్స్ అయ్యాయి.ఈ మూవీ తెలుగు ఇండస్ట్రీలో చెప్పుకోదగిన హిట్ గా నిలిచింది.

ఒకవేళ విజయ్ చేసి ఉంటే ఇంతకుమించి హిట్ అయి ఉండొచ్చు.కాబట్టి దీని కోల్పోవడం అతను ఒక తప్పు చేయడమే అని చెప్పుకోవచ్చు.సైన్స్ ఫిక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్‌లో( Ismart Shankar ) రామ్ పోతినేని టైటిల్ రోల్ వేశాడు నిజానికి ఈ పాత్ర ముందుగా విజయ్ వద్దకే వచ్చింది.అయితే డబుల్ దిమాక్ కథ విన్నాక ఈ హీరో బాగా కన్ఫ్యూషన్ లో పడిపోయాడట.
దాన్ని చేయడం తనకు సాధ్యమవుతుందో లేదో అనే సందేహంలో పడ్డాడట అసలు ఆ సినిమా హిట్ అవుతుందో లేదో అని కూడా అనుమానపడ్డాడట.అందుకే దానిని సింపుల్ గా రిజెక్ట్ చేసేసాడు.
జోక్ ఏంటంటే ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.విజయ్ ఈ నిర్ణయం తీసుకోవడం కొంతమంది కరెక్టే అంటారు ఎందుకంటే ఈ సినిమాలో రామ్ తప్ప మరో హీరో సూట్ కారు.

కబీర్ సింగ్( Kabir Singh ) అర్జున్ రెడ్డి సినిమాకి హిందీ రీమేక్ అని స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు ఈ హిందీ వెర్షన్ లో కూడా విజయ్ దేవరకొండనే నటింపజేయాలని సందీప్ రెడ్డి వంగా అనుకున్నారు కానీ ఆల్రెడీ నటించిన సినిమాల్లో మళ్ళీ నటించడం తనకి ఇష్టం లేదని విజయ్ దానిని తిరస్కరించాడు.ఇది కూడా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఉప్పెన సినిమాలో( Uppena ) హీరోగా చేసే ఛాన్స్ కూడా విజయ్ చెంతకే వచ్చింది.కానీ క్లైమాక్స్ నచ్చక దానిని చేయడానికి ఈ రౌడీ స్టార్ ఒప్పుకోలేదు.
ఒకవేళ ఈ నాలుగు సినిమాలు చేస్తుంటే విజయ్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ టాలీవుడ్ హీరో అయిపోయాడు.వీటిని కాదనుకొని ఇప్పుడు ఒక హిట్టు కొట్టడానికి ఈ హీరో చాలానే కష్టపడుతున్నాడు.
మళ్లీ జన్మలో అలాంటి బ్లాక్ బస్టర్ అతని వద్దకు వస్తాయో రావో చూడాలి.