శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు (కిడ్నీ) ముందుంటాయి.నిత్యం శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసి.
మలినాలను బయటకు పంపడంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి.అటువంటి మూత్రపిండాలు దెబ్బ తింటే.
లైఫ్ రిస్క్‌లో పడినట్టే అవుతుంది.ఇక ముత్రపిండాల సమస్యలు ఉన్న వారు ఖచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
అందులోనూ ఆహారం విషయంలో చాలా నియమాలు పాటించాలి.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఇంతకు ముందులా అన్ని ఆహారాలు తీసుకోకూడదు.
ముఖ్యంగా కొన్ని ఆహారాలు అస్సలు తీసుకోరాదు.అవేంటి అన్నది ఆలస్యం చేయకుండా చూసేయండి.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు మీట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తినరాదు.ఎందుకంటే, మీట్ జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
దాంతో కిడ్నీలపై అధిక ఒత్తిడి పడి.మూత్రపిండాల సమస్యలను రెట్టింపు చేస్తుంది.
అందువల్ల. ఫిష్, గుడ్డు వంటివి తీసుకుంటే మంచిది.
అది కూడా మితంగానే తీసుకోవాలి.

కిడ్నీ సమస్యలు ఉన్న వారు ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి.ఉప్పుకు ప్రత్యామ్నాయంగా హెర్బ్స్, మసాలాలు వాడుకోవచ్చు.సోడియం ఎక్కువగా ఉండే ఏ ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిది.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు టమాటాలకు కూడా దూరంగానే ఉండాలి.అలాగే పాలు, పెరుగు, వెన్న వంటి వాటికి కూడా కిడ్నీ సమస్యలు ఉన్న వారు దూరంగా ఉండాలి.
వెన్న తీసిన పాలు, మజ్జిగ వంటివి మాత్రమే తీసుకోవాలి.
కిడ్నీ సమస్యలు ఉన్న వారు భూమిలో పండిన బంగాళదుంపలు, క్యారెట్, బీట్ రూట్, చిలకడ దుంప, చామ దుంప వంటివి ఎట్టి పరిస్థితిలో తినకూడదు.
అలాగే ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, సోడాలు వంటి కూడా తీసుకోరాదు.ఇవి కిడ్నీ సమస్యలను మరింత రెట్టింపు చేస్తాయి.ఇక కిడ్నీ సమస్యలు ఉన్న వారు ధూమపానం మరియు మద్యపానానికి దూరంగా ఉండాలి.