ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు( Temperature ) పెరిగిపోతున్నాయి.గత కొద్ది రోజులుగా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి.
కానీ ఉక్క పూత అధికంగా ఉంది.పది రోజుల క్రితం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఉదయమే సూర్యుడు భగభగ మండే వాడు.దీంతో ప్రజలు రోడ్లపైకి రావడానికి భయపడే పరిస్థితి నెలకొంది.
కానీ గత కొద్దిరోజులుగా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడుతుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టాయి.పరిస్థితి ఇలా ఉండగా విపత్తుల నిర్వహణ సంస్థ( Disaster Management Agency ) ఏపీ ప్రజలను అప్రమత్తం చేస్తూ సంచలన ప్రకటన చేసింది.
విషయంలోకి వెళ్తే మంగళవారం, బుధవారం ఎండ ప్రభావం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించడం జరిగింది.
రేపు 149 మండలాల్లో తీవ్ర వడగాల్పులు,( Heat Waves ) 160 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.ఇవాళ తిరుపతి(D) సత్యవేడులో 41.9, నెల్లూరు(D) మనుబోలులో 41.5, బాపట్ల (D) వేమూరు, కృష్ణా జిల్లా పెడనలో 40.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది.మరోపక్క దేశంలోకి నైరుతి రుతుపవనాలు ఐదు రోజుల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండి ప్రకటన చేయడం జరిగింది.
ఈసారి రుతుపవనాల రాకకు పరిస్థితులు ముందుగానే అనుకూలంగా ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది.కేరళను తాకిన అనంతరం దేశమంతట ఋతుపవనాలు విస్తరిస్తాయని స్పష్టం చేయడం జరిగింది.