కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో( Kumaram Bheem Asifabad ) భారీగా నకిలీ పత్తి విత్తనాలు( Fake Cotton Seeds ) పట్టుబడ్డాయి.ఈ మేరకు సుమారు 325 కేజీల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చింతలమానేపల్లి మండలంలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు( Taskforce Police ) రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ విత్తనాలను సీజ్ చేశారు.మొత్తం రూ.8 లక్షల విలువైన నకిలీ విత్తనాలను అధికారులు గుర్తించారని సమాచారం.కాగా నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 445 కేజీల నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.