ప్రస్తుత సమాజంలో ఉన్న చాలా మంది ప్రజలకు ఆరోగ్యం పై కాస్త శ్రద్ధ పెరిగింది.దీనివల్ల చెడు ఆహారపు అలవాట్లను ప్రజలు దూరం చేసుకుని, మంచి ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు.
కొంతమంది అయితే ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగుతూ ఉంటారు.రోజంతా పనిచేసే అలసిపోయిన వారికి ఉదయాన్నే నిద్ర లేచి కప్పు టీ తాగితే ఎంతో ప్రశాంతంగా ఉంటుందని చెబుతూ ఉంటారు.
సాధారణంగా టీ అంటే ప్రతి ఒక్కరూ తయారు చేసే విధంగా పాలు, అందులోకి టీ పొడి చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు.ఈ విధానం కంటే మరికొన్ని రకాల టీలు ఎలా తయారు చేసుకోవాలో, వాటిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే బాదం టీ( Almond tea )కి కావాల్సిన పదార్థాలు టీ పొడి, బాదం పప్పులు, పాలు, నిమ్మరసం, చక్కెర ఉంటే సరిపోతుంది.ముందుగా నీటిని వేడి చేసి అందులో సన్నగా తరిగిన బాదంపప్పులు వేసి బాగా మరిగించాలి.మరిగించి తర్వాత అందులో చక్కెర, తేనె, నిమ్మరసం( Honey ) కలిపి తాగితే ఎంతో రుచిగా ఉంటుంది.దాల్చిన చెక్క టీ కి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే దాల్చిన చెక్క, నిమ్మ ఆకులు, అల్లం, పుదీనా ఆకులు ఉంటే సరిపోతుంది.ముందుగా ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగించి, ఆ తర్వాత దాల్చిన చెక్క పొడి, అల్లం పేస్టు, నిమ్మ ఆకులు వేసి బాగా మరిగించాలి.
చివరగా నిమ్మరసం కలిపి పుదీనా ఆకులు పైన చల్లి తీసుకుంటే ఇది ఎంతో రుచిగా ఉంటుంది.

ఈ టి రోజు తాగితే గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది.అలాగే జీర్ణ సంబంధిత సమస్యలు( Digestive problems ) కూడా దూరమవుతాయి.
రోజంతా హుషారుగా పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తి శరీరానికి లభిస్తుంది.కాబట్టి ఈ బాదం టీ తాగి ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
ఇది చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తుంది.ఒత్తిడి, డిప్రెషన్, తలనొప్పి అందులో ఉన్న వంటి సమస్యలను లేకుండా మెదడును చురుగ్గా ఉంచడమే కాకుండా వయసు పెరిగే కొద్దీ వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది.