వినండి వినండి.. ఇండస్ట్రీలో కొత్త వారసులు రాబోతున్నారు?

తెలుగు చిత్ర పరిశ్రమలో వారసులకు కొదవలేదు.నిజంగా చెప్పాలంటే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న అందరు హీరోలు వారసులే.

 Here Is The New List Of New Generation Heros , Nandamuri, Mega, Daggubati, Akkin-TeluguStop.com

మంచి క్రేజ్ ఉన్న హీరోలు కూడా ఇలా వారసులే.తరచు టాలీవుడ్ లో ఉన్న పెద్ద ఫ్యామిలీ లో నుంచి ఎవరో ఒకరు ఇక ఇండస్ట్రీలోకి ఫామిలీ నుండి వారసుడిగా చిత్ర పరిశ్రమకు హీరోగా పరిచయం అవడం జరుగుతుంటుంది.

ఈ.క్రమంలోనే నందమూరి, మెగా, దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు .మరీ ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అరడజనుకు పైగా హీరోలు టాలీవుడ్ లోకి రావడం గమనార్హం.

Telugu Abhi Ram, Akira Nandan, Akkineni, Balayya Aditya, Daggubati, List Heros,

ఇప్పుడు మరి కొంతమంది వారసులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.త్వరలోనే దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి తన సోదరుడు అభి రామ్ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.ఇక నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కి రెడీ అయిపోయాడు.

మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఇక ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని వార్తల నేపథ్యంలో మరింత ఆసక్తి తో చూస్తున్నారు.క్రిష్ లేదా బోయపాటి శ్రీను దర్శకత్వంలో అతను సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది.

Telugu Abhi Ram, Akira Nandan, Akkineni, Balayya Aditya, Daggubati, List Heros,

గతంలో బాలయ్య ఆదిత్య 369 సినిమా లాగానే ఆదిత్య 999 సినిమాను మోక్షజ్ఞ తో తీయబోతున్నట్లు టాక్.కానీ అది ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు.జూన్ పదవ తేదీన తన పుట్టినరోజు నాడు మోక్షజ్ఞా ఎంట్రీ పై నందమూరి బాలకృష్ణ కి క్లారిటీ ఇస్తాడని అందరు ఎదురు చూస్తున్నారు.పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరా నందన్ కి కూడా హీరో గా ఎంట్రీ ఇచ్చేందుకు సమయం దగ్గరపడిందనీ.

ప్రచారం జరుగుతోంది.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న అఖీరా ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడట.

కానీ ఇప్పటివరకు క్లారిటీ లేదు.ఇక విక్టరీ వెంకటేష్ తనయుడు అర్జున్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడట.

వెంకటేష్ పెద్ద కుమార్తె వివాహ వేడుక లో సందడి చేసిన అర్జున్ రానా తరహాలోనే హైట్ కనిపించాడు.ఇప్పటివరకు ఇతని ఎంట్రీ గురించి ఒక్క లీక్ కూడా బయటకు రాలేదు.

ఇక సూపర్ స్టార్ ముద్దుల కుమారుడు గౌతమ్ సైతం హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారనీ తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube