తల దురద.చాలా మంది కామన్‌గా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.
తల దురద చిన్న సమస్యే అయినప్పటికీ.చాలా ఇబ్బందికరంగా ఉంటుంది.
తల దురదకు కారణాలు చాలా ఉన్నాయి.చుండ్రు, చెమట, పేలు, అలర్జీ ఇలా పలు రకాల కారణాల వల్ల తల తరచూ దురద పెడుతుంది.
ఈ సమస్యను నివారించుకునేందుకు రకరకాల షాంపూలు మారుస్తుంటారు.అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే.
తెగ బాధ పడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా తల దురద సమస్యను నివారించుకోవచ్చు.
మరి అందుకోసం ఏం చేయాలి అన్నది ఆలస్యం చేయకుండా చూసేయండి.
తల దురదను నివారించడంలో నిమ్మ మరియు పెరుగు కాంబినేషన్ అద్భుతంగా సహాయపడుతుంది.
కాబట్టి, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పెరుగు మరియు నిమ్మ రసం వేసి బాగ మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు బాగా పట్టించి.గంట తర్వాత గోరు వెచ్చని నీటితో మామూలు షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా వారినికి రెండు సార్లు చేస్తే తలదురద సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

బేకింగ్ సోడా కూడా తల దురదను సులువుగా నివారించగలదు.ఒక బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల బేకింగ్ సోడా మరియు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి.అరగంట పాటు వదిలేయాలి.అనంతరం గోరు వెచ్చని నీటితో సాధారణ షాంపూతో తలస్నానం చేయాలి.ఇలా తరచూ చేసినా కూడా తల దురద శాశ్వతంగా పోతుంది.
తల దురద సమస్య ఉన్న వారికి అవొకాడో ఆయిల్ కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది.ముందుగా అవొకాడో ఆయిల్ తీసుకుని.
అందులో కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించాలి.ఇలా రెండు రోజులకు ఒక సారి చేయడం వల్ల దురద తగ్గడంతో పాట జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది.