ఇంట్లోనే బీట్ రూట్ తో ఫేషియల్ చేసుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా..?

బీట్ రూట్( Beet Root).ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే దుంపల్లో ఒకటి.

 How To Do Facial With Beetroot At Home! Facial, Beet Root, Beetroot Benefits, La-TeluguStop.com

అనేక రకాల విటమిన్స్, మినరల్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ తో బీట్ రూట్ లోడ్ చేయబడి ఉంటుంది.అందువల్ల చాలామంది ఈ దుంప‌ను డైలీ డైట్ లో భాగం చేసుకుంటారు.

ముఖ్యంగా కూర రూపంలో కంటే బీట్ రూట్ ను జ్యూస్ రూపంలో తీసుకునే వారి సంఖ్య ఎక్కువ.అయితే ఆరోగ్యానికే కాదు చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి కూడా బీట్ రూట్ సహాయపడుతుంది.

ముఖ్యంగా బీట్ రూట్ తో ఇంట్లోనే ఇప్పుడు చెప్పబోయే విధంగా ఫేషియల్ చేసుకుంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం బీట్ రూట్ తో ఫేషియల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బీట్ రూట్ తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.ఇప్పుడు ఫేషియల్ ప్రాసెస్ లో భాగంగా.

మొదట క్లెన్సింగ్ చేసుకోవాలి.అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్ మరియు వన్ టేబుల్ స్పూన్ పాలు( milk ) వేసుకొని బాగా కలుపుకోవాలి.

ఈ జ్యూస్ ను దూది సహాయంతో ముఖానికి అప్లై చేసుకుని చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

-Telugu Health

>

స్టెప్ 2 స్క్రబ్బింగ్

.ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేసుకుని మూడు నిమిషాల పాటు సున్నితంగా స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.

ఆపై వాటర్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

-Telugu Health

స్టెప్ 3 మసాజ్

.ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, హాఫ్‌ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని కనీసం 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.అనంతరం తడి క్లాత్ తో చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.

స్టెప్ 4 ఫేస్ ప్యాక్‌

.ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ముల్తాని మట్టి, వన్ టేబుల్ స్పూన్ రోజ్ పెటల్స్ పౌడర్ మరియు సరిపడా బీట్ రూట్ జ్యూస్ వేసుకొని కలుపుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి.

ఆపై వాటర్ తో క్లీన్ చేసుకోవాలి.నెలకు రెండు సార్లు బీట్ రూట్ తో ఇంట్లోనే ఈ విధంగా ఫేషియల్ చేసుకోవడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

ముఖ్యంగా చర్మం పై పేరుకుపోయిన మృత కణాలు, మలినాలు తొలగిపోతాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది.

టాన్ రిమూవ్ అవుతుంది.చర్మం కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.

వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి.ఏజింగ్‌ ప్రాసెస్ ఆలస్యం అవుతుంది.

మరియు స్కిన్ హెల్తీ గా ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube