టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్( Shruti Haasan ) గురించి మనందరికి తెలిసిందే.కమల్ హాసన్ కూతురిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
టాలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్.తెలుగులోనే కాదు తమిళ్ లోనూ హిందీలోనూ సినిమాలు చేసింది.
శ్రుతి హాసన్ హీరోయిన్ గానే కాదు సింగర్ గా( Singer )ను తన టాలెంట్ నిరూపించుకుంది.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈమె సినిమాల పరంగా మంచి ఊపు మీద ఉంది.
ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఈమె దర్శకనిర్మాతలకు లక్కీచామ్ గా మారిపోయింది.

అయితే ఈమె సినిమాల పరంగా కెరియర్ బాగున్నప్పటికీ వ్యక్తిగత జీవితం( Personal life ) ఆశ్రయించిన స్థాయిలో లేదు అని చెప్పాలి.ఈమెకు ప్రేమలు బ్రేకప్స్ కొత్త కాదనే చెప్పాలి.మినిమం గ్యాప్ లో ఆమె ప్రేమలో పడుతుంది, ఆ వెంటనే బ్రేకప్ కూడా అవుతుంది.
ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరోసారి బ్రేకప్ దశలో ఉన్నట్టు కనిపిస్తోంది.గత కొన్నాళ్లుగా డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారిక( Santanu Hazarika )తో డేటింగ్ చేస్తోంది శృతిహాసన్.
ఆ విషయాన్ని ఆమె దాచిపెట్టే ప్రయత్నం కూడా చేయలేదు.ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో శాంతనూతో దిగిన ఫొటోలు, వీడియోలు పెడుతూనే ఉంది.
ఇంకా క్లారిటీగా చెప్పాలంటే కరోనా టైమ్ కు ముందు నుంచే వీళ్లు డేటింగ్ లో ఉన్నారు.కరోనా సమయంలో ఇద్దరూ ఒకే ఫ్లాట్ కు షిఫ్ట్ అయ్యారు.
అది శృతిహాసన్ సొంత ఫ్లాట్.అప్పట్నుంచి లివ్ ఇన్ లోనే ఉన్నారు.

ఇప్పుడు విడిపోయినట్టు( Breakup ) వార్తలు వినిపిస్తున్నాయి.శృతిహాసన్, శాంతను సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు.అంతకంటే ముందు పరోక్షంగా ఒక పోస్ట్ పెట్టింది శృతిహాసన్.ఇది చాలా క్రేజీ రైడ్.ఈ జర్నీలో నా గురించి, కొంతమంది మనుషుల గురించి చాలా నేర్చుకున్నాను అని రాసుకొచ్చింది.వీళ్లిద్దరూ విడిపోయరంటూ పుకార్లు రావడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి.
తను ఏ కార్యక్రమానికి వెళ్లినా శాంతనూను కూడా తీసుకెళ్తుంది శృతిహాసన్.కానీ ఈమధ్య తను సింగిల్ గానే వెళ్తోంది.
దీనికితోడు తన సోషల్ మీడియా( Social Media ) ఎకౌంట్ నుంచి శాంతనుకు సంబంధించిన చాలా ఫొటోలు, వీడియోల్ని ఈమె డిలీట్ చేసినట్టుంది.







