రాజోలు వారాహి సభలో సిఎం జగన్ పై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) శుక్రవారం రాజోలులో వారాహి సభ నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ ( CM Jagan ) పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

సొంత చెల్లెలు వేసుకున్న బట్టల పైన కామెంట్లు చేసే దిగజారుడు వ్యక్తి అని ముఖ్యమంత్రిపై ఘాటుగా విమర్శలు చేశారు.జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి లాంటి రౌడీలకు తాను భయపడనని అన్నారు.

గులకరాయి నిందితులను పట్టుకుంటారు కానీ.రథాలు కాల్చిన వారిని పట్టుకోలేరు.

దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై( MLC Anantha Babu ) చర్యలేవీ? అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వైసీపీని ఇంటికి పంపించే సమయం ఆసన్నమైంది.

Advertisement

రాష్ట్రంలో ఇప్పటికే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది అని పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు.భీమ్లా నాయక్, వకీల్ సాబ్ సినిమాలను వైఎస్ జగన్ అడ్డుకోవాలని చూశారని ఆరోపించారు.నేను వెళ్లి జగన్ ను బతిమిలాడతాను అని అనుకున్నాడు.

అవసరమైతే ఉచితంగా ఇంటర్నెట్ లో సినిమాలను వదిలే వ్యక్తిని నేను.నా ఆత్మగౌరవాన్ని తగ్గించుకోను అని పవన్ స్పష్టం చేశారు.18 రోజుల్లో తమ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, ఆ తర్వాత అవినీతిపరుల భరతం పడతామని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

అంతేకాకుండా రాపాక వరప్రసాద్ 5 ఎకరాల్లో భారీగా ఇల్లు కట్టుకున్నారని.రైతుల కష్టాలను ఆయన ఎందుకు తీర్చలేకపోయారని పవన్ నిలదీశారు.

పిఠాపురం ప్రజలకు విజ్ఞప్తి .. ఇట్లు మీ చిరంజీవి
Advertisement

తాజా వార్తలు