ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నియోజకవర్గాలలో హిందూపురం నియోజకవర్గం( Hindupuram Constituency ) కూడా ఒకటనే సంగతి తెలిసిందే.హిందూపురం టీడీపీ కంచుకోట అయినప్పటికీ ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధించే అవకాశాలు అయితే ఉన్నాయి.
వైసీపీ ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టి గెలుపు కోసం సరైన అవకాశం వస్తుందేమో అని ఎదురుచూస్తుండటం గమనార్హం.
గతంలోనే ఈ నియోజకవర్గంలో వైసీపీ( YCP ) గెలవాల్సి ఉన్నా వైసీపీ నేతల మధ్య విబేధాలు టీడీపీకి( TDP ) ప్లస్ అయ్యాయి.
ఈసారి ఎన్నికల్లో హిందూపురం నుంచి దీపిక పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.అటు బాలయ్య, ఇటు దీపిక( Deepika ) నామినేషన్లను దాఖలు చేసి గెలుపు కోసం తెగ కష్టపడుతున్నారు.
హిందూపురంలో కూటమికే ఎడ్జ్ ఉన్నా కచ్చితంగా కూటమి గెలుస్తుందని చెప్పే పరిస్థితులు మాత్రం లేవు.
అయితే మరోవైపు 20 సంవత్సరాల క్రితం బాలయ్య( Balayya ) తుపాకీతో కాల్చడం వల్ల ఒక కేసులో చిక్కుకుని తర్వాత మానసిక స్థితి బాలేదని సర్టిఫికెట్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే ఆ కేసుల వల్ల, సర్టిఫికెట్ వల్ల బాలయ్య నామినేషన్ కు ఇబ్బంది ఎదురయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో టీడీపీ వసుంధరతో కూడా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నామినేషన్ వేయించారు.
అయితే వసుంధర( Vasundhara ) నామినేషన్ గురించి అటు టీడీపీ అనుకూల పత్రికలు కానీ ఇటు వైసీపీ కానీ ప్రచారం చేయకపోవడం గమనార్హం.ఏదైనా కారణాల వల్ల బాలయ్య నామినేషన్ రిజెక్ట్ అయ్యి వసుంధర పోటీ చేస్తే మాత్రం నెట్టింట ఆమె గురించి చర్చ జరిగే ఛాన్స్ అయితే ఉంది.హిందూపురంలో ఏ పార్టీకి ఫేవర్ గా ఫలితాలు వస్తాయో చూడాలి.
హిందూపురంలో హ్యాట్రిక్ తో సత్తా చాటాలని బాలయ్య భావిస్తుండగా ఆయన ఆశించిన విధంగా ఫలితాలు వస్తాయో రావో తెలియాల్సి ఉంది.