సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!

ఈ మధ్యకాలంలో చాలామంది యువత పెళ్లి కాక అలాగే దంపతులు పిల్లలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.అయితే దీనికి కారణం కొంతమంది నాగదోషం లేదా మరికొందరు కుజదోషం అని అంటున్నారు.

 Are You Having Trouble With Children But It Is Enough To Go To The Temple Once ,-TeluguStop.com

కానీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి( Mopidevi Subrahmanyeshwara Swamy ) ఆలయాన్ని దర్శిస్తే వివాహ సంబంధ దోషాలు అన్ని తొలగిపోతాయని స్కంద పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు.అయితే ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో ఉంది.

అయితే శివ భగవానుడిని భర్తగా పొందేందుకు పార్వతీదేవి తపస్సు ప్రారంభించింది.అయితే పార్వతి దేవి( Goddess Parvati ) ఎంత కాలం తపస్సు చేసిన కూడా శివుడు ప్రత్యక్షం కాలేదు.

Telugu Andhra Pradesh, Bhakti, Devotional, Goddess Parvati, Sage Agastya-Latest

ఇక పార్వతి దేవి ఆగ్రహంతో ఊగిపోయి ఆ సమయంలో ప్రత్యక్షమైన ఆగస్త్య మహాముని కొన్ని దోషాల కారణంగా శివుడు ప్రసన్నం కాలేదంటూ ఉపచార మార్గాలను సూచించాడు.వింధ్య పర్వతం పై పాము ఆకారంలో వివాహ దేవుడు ఉంటాడు.ఇక అక్కడికి వెళ్లి దర్శనం చేసుకుని, మరల తపస్సు చేయమని చెబుతాడు.దీంతో పార్వతి దేవి వింధ్య పర్వతంలోని స్వామి వద్దకు వెళ్ళగానే అక్కడ పాము ఆకారంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారి కోరికను తెలుసుకొని, శివ భగవానుడినికి తెలియజేస్తాడు.

ఆ తర్వాత మీ పుణ్య దంపతులకు కుమారు జన్మిస్తాడని ప్రార్థించాడని ఆధ్యాత్మిక గ్రంథాలలో పేర్కొనడం జరిగింది.

Telugu Andhra Pradesh, Bhakti, Devotional, Goddess Parvati, Sage Agastya-Latest

ఈనాటి మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయమే ఆనాటి వింధ్య పర్వతం.అయితే దక్షిణ భారతదేశంలోని షణ్ముఖ దేవాలయాల్లో ఒకటి మోపిదేవి లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.దీన్ని అగస్త్య మహర్షి ప్రతిష్టించినట్లు స్కంద పురాణంలో ఉంది.

అలాగే కుమార నక్షత్రమే సుబ్రహ్మణ్య క్షేత్రం స్కంద పురాణంలోని సింహాద్రి ఖండంలో మోపిదేవి ఆలయ మహిమల గురించి చాలా పేర్కొనడం జరిగింది.కాబట్టి వివాహం కాని యువతీ, యువకులు సంతానం లేని దంపతులు ఇక్కడికి వచ్చి పూజలు చేయించుకుంటే దోషాలు అన్ని పోతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube