ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.11
సూర్యాస్తమయం: సాయంత్రం 05.56
రాహుకాలం: ఉ.9.00 ల10.30 వరకు
అమృత ఘడియలు:ఉ.10.30 మ12.00 ల3.30 సా5.30 వరకు
దుర్ముహూర్తం:ఉ.7.41మ8.32 వరకు
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీ కుటుంబ సభ్యులు అంతా కలిసి బంధువుల ఇంటికి వెళ్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి వారితో చర్చలు చేస్తారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.
వృషభం:
ఈరోజు మీరు స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
మిథునం:
ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.
కర్కాటకం:
ఈరోజు మీరు విదేశాలకు వెళ్లాలనే ఆలోచనలో ఉంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుట పడుతుంది.మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.
సింహం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు.వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరంగా డబ్బులే ఎక్కువ ఖర్చు చేస్తారు.
కన్య:
ఈరోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఏ పని మొదలు పెట్టిన అంతా శుభమే జరుగుతుంది.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
తులా:
ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.ఎప్పటినుండో ఉన్న కోర్టు సమస్యల నుండి ఈరోజు మీరు బయటపడతారు.కొన్ని వర్గ సంబంధిత విభేదాలు జరిగే అవకాశం ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృశ్చికం:
ఈరోజు మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది.ఈరోజు ఏ పని మొదలుపెట్టిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.ఇరుకు పొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది.ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి.
ధనస్సు:
ఈరోజు మీరు శత్రువులకు దూరంగా ఉండటమే మంచిది.ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టిన కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఇతర వాటిపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడమే మంచిది.
మకరం:
ఈరోజు మీరు విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
కుంభం:
ఈరోజు మీ మనసులో ఏదో తెలియని ఆందోళన ఉంటుంది.కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడమే మంచిది.కొన్ని దూరపు ప్రాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మీనం:
ఈరోజు మీ తండ్రి యొక్క ఆరోగ్యం కుదుటపడుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
LATEST NEWS - TELUGU