తన సొంత దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటించిన సినిమా కాంతార. గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి సరసన సప్తమీ గౌడ హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా అచ్యుత్ కుమార్, కిషోర్ కుమార్, సుచాన్ శెట్టి, ప్రమోద్ శెట్టి తదితరులు కూడా నటించారు.
హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ సినిమాకు నిర్మాతగా బాధ్యతలు చేపట్టారు.అజనిష్ లోక్ నాథ్ మ్యూజిక్ ను అందించాడు.
ఇక అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫిని అందించాడు.ఇక ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను ఇప్పటికే ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా ఇతర భాషలో విడుదల కాగా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది.దీంతో ఈ సినిమాను తెలుగులో ఈరోజు విడుదల చేశారు.ఇక ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో అంతేకాకుండా డైరెక్టర్ రిషబ్ శెట్టి కి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ అందించిందో చూద్దాం.
కథ:

ఈ సినిమాలో రిషబ్ శెట్టి శివ పాత్రలో నటించాడు.ఇక శివ కర్ణాటకలోని కోస్టల్ ఏరియాలో దట్టమైన అడవిలోనే జీవిస్తాడు.ఇక తన ప్రాంతాన్ని కన్న భూమిగా జాగ్రత్తగా చూసుకుంటాడు.
అదే సమయంలో ఆ ప్రాంతంలో నివసిస్తున్న లీలా (సప్తమీ గౌడ) ను ఇష్టపడతాడు.తన ప్రాణాల కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తాడు.
లీలా ఫారెస్ట్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తుంది.ఇక ఆ ఆటవి ప్రాంతాన్ని కబిలించేందుకు భూస్వామి (అచ్యుత్ కుమార్), ఫారెస్ట్ అధికారి మురళి (కిషోర్ కుమార్) ప్లాన్ చేస్తారు.
దీంతో వారిని ఎదుర్కోవటానికి శివ బరిలోకి దిగుతాడు.చివరికి తన కన్న భూమి కోసం తన ప్రాణాలు కూడా అర్పించడానికి సిద్ధమవుతాడు శివ.అలా శివ తన అడవి తల్లిని కాపాడుకునేందుకు ఎటువంటి త్యాగాలకు పాల్పడతాడు అని.అక్కడున్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి అనేది.చివరికి శివ వారిని ఎలా ఎదుర్కొంటాడు.తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
డైరెక్టర్ కో హీరో రిషబ్ తన పర్ఫామెన్స్ తో అద్భుతంగా ఆకట్టుకున్నాడు.తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు.
తన ఎక్స్ప్రెషన్స్ తో మాత్రం ప్రేక్షకులను ఫిదా చేసాడు.ఇక హీరోయిన్ సప్తమీ గౌడ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది.
రొమాంటిక్ సీన్లలో ఇద్దరు బాగా అదరగొట్టారు.మిగతా నటినటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
టెక్నికల్:
హీరోగా, డైరెక్టర్ గా రిషబ్ శెట్టి అద్భుతమైన కథతో పాటు అద్భుతమైన నటనను చూపించాడు.ఇక అరవింద్ అందించిన సినిమాటోగ్రఫీ బాగా ఆకట్టుకుంది.
మిగిలిన సాంకేతిక భాగాలు తమ పనుల విషయంలో పూర్తి న్యాయం చేశాయి.నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
విశ్లేషణ:
ఈ సినిమాను డైరెక్టర్ గ్రామీణ నేపథ్యంలో అద్భుతంగా చూపించాడు.అంతేకాకుండా తమ భూమి కోసం, ఆ భూమిని కోల్పోకుండా ఉండటం కోసం ప్రజలు బాధపడుతున్న తాపత్రయాన్ని అద్భుతంగా చూపించాడు.
ప్లస్ పాయింట్స్:

కథ, కథనం బాగా ఆకట్టుకుంది.మ్యూజిక్, సినిమాటోగ్రఫీ బాగుంది.నటీనటుల నటన.క్లైమాక్స్.
మైనస్ పాయింట్స్:
కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగినట్లు అనిపించాయి.నటీనటుల పరిచయం అంతగా తెలియకపోవటంతో కాస్త కొత్తదనంగా అనిపించింది.కొన్ని మార్పులు ఉంటే మరింత బాగుండేది.
బాటమ్ లైన్:
గ్రామీణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది.కాబట్టి ఈ సినిమాను తప్పకుండా చూడవచ్చు.